బాల్యం ఓ మధుర జ్ఞాపకం. చిన్నప్పుడు పలు సందర్భాల్లో తీసిన ఫోటోలు, వీడియోలను జాగ్రత్తగా దాచుకుని పెద్దయ్యాక చూసుకోవడం.. తమ పిల్లలకి, పిల్లల పిల్లలకి వాటిని చూపించడం అనేది ఓ మధురానుభూతి. సెలబ్రిటీల చైల్డ్ హుడ్ మెమరీస్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి.
బాల్యం ఓ మధుర జ్ఞాపకం. చిన్నప్పుడు పలు సందర్భాల్లో తీసిన ఫోటోలు, వీడియోలను జాగ్రత్తగా దాచుకుని పెద్దయ్యాక చూసుకోవడం.. తమ పిల్లలకి, పిల్లల పిల్లలకి వాటిని చూపించడం అనేది ఓ మధురానుభూతి. సెలబ్రిటీల చైల్డ్ హుడ్ మెమరీస్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. చిన్నప్పుడే స్టీరింగ్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకి ఫోజు ఇస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా?. తండ్రి నుండి నటనను వారసత్వంగా తీసుకున్నా కానీ అతి తక్కువ టైంలో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. చేసే క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడడం, అందులో ఇన్వాల్వ్ అవడం తనకి ప్లస్ పాయింట్స్. తన నటనతో ఇతర ఇండస్ట్రీల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు. ఎవరీ బాబు అనుకుంటున్నారా?. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్. జూలై 28న దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ అతని చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. మలయాళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ అద్బుతమైన పాత్రలు చేసి ప్రేక్షకాభిమానులను అలరించాడు దుల్కర్. కేవలం మాతృభాషలోనే కాకుండా సౌత్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ యంగ్ హీరో తను.
తెలుగులో ‘మహానటి’ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైపోయాడు. ‘సీతా రామం’ తో చెరుగని ముద్ర వేశాడు. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. యాక్షన్, లవ్, ఎమోషన్ ఏదైనా అద్భుతంగా పండించగలడు. కేవలం యాక్టర్‌గానే కాకుండా, సింగర్, ప్రొడ్యూసర్‌గానూ అలరించాడు. ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్ ఆఫ్ కోతా’ విడుదలకు సిద్ధమవుతోంది. దుల్కర్‌కు భార్య అమల్ సూఫియా, ఓ పాప ఉన్నారు.