తెలుగు బుల్లితెర యాంకర్ శ్రీముఖి తాజాగా వివాదంలోకి చిక్కుకున్నారు. యాంకరింగ్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్న శ్రీముఖి తన హవాను కొనసాగిస్తోంది. అయితే మన తెలుగు బుల్లితెర యాంకర్‌లు అప్పడప్పుడు నోరు జారుతూ వివాదంలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీముఖి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ అంకుల్స్. ఈ సినిమాకు డైరెక్టర్ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 19 న విడుదలకు సిద్దంగా ఉంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీముఖి సినిమా కాస్త వివాదంలోకి వెళ్లింది. విషయమేంటంటే..? ఈ సినిమాలో కొన్ని సీన్స్ మహిళల భావాలను కించపరిచేలా ఉన్నాయని మహిళల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమాను అడ్డుకోవాలంటూ మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఈ మూవీ విడుదలపై కాస్త నీలిమెఘాలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ చిత్రం విడుదలవుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.