సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే.. గ్లామర్ షో చేయాల్సిందే! అన్న మాట ఎక్కువగా పరిశ్రమలో వినిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే కొంత మంది హీరోయిన్స్ అందాల ఆరబోతకు వెనకాడరు. అయితే ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత సోషల్ మీడియాలో ఎక్కువైందన్న వాదన వినిపిస్తోంది. ఇక హీరోయిన్స్ కు మేం మాత్రం తక్కువ కాదన్నట్లుగా బుల్లితెర యాంకర్స్ తమ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను చలికాలంలోనూ హీటెక్కిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సోయంగం అషు రెడ్డి, యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియా, యాంకర్ రష్మీ లాంటి మరికొంత మంది ముద్దు గుమ్మలు తమ అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. అయితే తాజాగా తమ డ్రస్సింగ్ స్టైల్ పై కామెంట్ చేసిన నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది యాంకర్ రష్మీ.
యాంకర్ రష్మీ.. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి.. జబర్దస్త్ షో ద్వారా యమ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక సుధీర్ – రష్మీ జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అర్దం చేసుకోవచ్చు వారి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో. అదీ కాక రష్మీ మంచి మనసు గురించి మనందరికి తెలిసిందే. కోవిడ్ సమయంలో జంతువులకు ఆహారాన్ని అందించి మంచి మనసు చాటుకుంది. ఇక ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది రష్మీ. హాట్ హాట్ ఫొటో షూట్ లతో మగాళ్లను మయాచేస్తోంది. ఈ క్రమంలోనే ఈ హాట్ హాట్ ఫొటో షూట్ లపై ఓ మీమర్ సెటైర్ వేశాడు. సదరు యాంకర్ల హాట్ హాట్ ఫొటోలన్నీ కలిపి..”వీళ్లు యాంకర్స్ కాదు మావ, హీరోయిన్స్ ఎలా అవ్వాలో తెలియక ఉండిపోయిన హీరోయిన్స్” అని రాసుకొచ్చాడు.
ఇక ఈ మీమ్ కాస్త రష్మీ కంటపడటంతో.. ఆ మీమర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “మీరు ఈ ఫొటోలో ఓ కామన్ పాయింట్ మిస్ అయ్యారు. ఆ అమ్మాయిలందరు తెలుగు ప్రాంతాల్లో పుట్టిన వారే. అదే ముంబాయి బోర్డింగ్ పాస్ ఉంటే కథ వేరేలా ఉండేదేమో. అప్పుడు మేం వేసుకున్న డ్రస్సులు కూడా ట్రెండ్ సెట్టింగ్ గా ఉండేదేమో” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సాధారణంగా ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ బట్టలు ఎలా వేసుకున్నా గానీ వారిని పొగుడుతారు.. మమ్మల్ని తిడతారు అన్న అర్దంలో రష్మి ఆ మీమర్ కు కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ కౌంటర్ నెట్టింట వైరల్ గా మారింది.