సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా వీలైనంత త్వరగా తెలుసుకోవాలనే ఆత్రుత అందరి ఫ్యాన్స్ లోనూ ఉంటుంది. కానీ.. ఏదొక ఫెస్టివల్, ఈవెంట్ లేదా సరైన సందర్భం వస్తేగాని సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. అయితే గుడ్ న్యూస్ లంటే పోస్ట్ చేస్తుంటారేమో గానీ.. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వార్తలైతే దాదాపు బయటికి రానివ్వరు. ఎందుకంటే.. తమ అభిమాన సెలబ్రిటీ అనారోగ్యానికి గురైందని తెలిస్తే ఫ్యాన్స్ కంగారు పడతారని విషయం చెప్పకుండా జాగ్రత్త పడుతుంటారు.
ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలబ్రిటీలకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా.. సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా పాపులర్ టీవీ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తుంది. హాస్పిటల్ బెడ్ పై లాస్య చికిత్స పొందుతున్న ఫోటోను స్వయంగా ఆమె భర్త మంజునాథ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్టోరీలో పోస్ట్ చేశారు. అలాగే లాస్య త్వరగా కోలుకోవాలని చెబుతూ లాస్య పేరును మెన్షన్ చేశారు.
దీంతో విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్స్ లాస్యకు ఏమైందని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. లాస్యకు ఏమైంది? ఆమె ఎందుకు హాస్పిటల్ లో చేరిందనే విషయాన్నీ ఆమె భర్త కూడా రివీల్ చేయలేదు. ఇక ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో గమినించినట్లయితే.. లాస్య బెడ్ పై పడుకొని ఉండగా ఆమెకు సెలైన్ ఎక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్, నెటిజన్స్ లాస్య త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. మరి యాంకర్ లాస్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 3, 2022