బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది లాస్య. యాంకర్ గా ఫామ్ లో ఉన్నప్పుడే నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటన పరంగా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ డెవలప్ చేసుకుంది. అందులో నుండి బయటికి వచ్చాక.. అడపాదడపా టీవీ షోలలో పాల్గొంటూ.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి, వ్లాగ్స్ లాంటి వీడియోలు చేస్తోంది.
ఇక లాస్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబర్ నెలలో తన సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించింది. లాస్యకి ఆల్రెడీ ఓ కొడుకు ఉన్నాడు. ఆ బాబుని జున్ను అని పిలుస్తుంటారు. కాగా.. ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతుండటంతో ఫ్యాన్స్ అంతా విష్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా లాస్య సీమంతం వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆమె సీమంతం వేడుకలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. లాస్య సీమంతం వేడుకలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో పాటు బుల్లితెర సెలబ్రిటీలు సైతం హాజరై సందడి చేశారు. ఇటీవలే లాస్య తన భర్త మంజునాథ్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
దీంతో న్యూ ఇయర్ ప్రారంభంలో సీమంతం వేడుకతో గుడ్ న్యూస్ చెప్పడంతో నెటిజన్స్ అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లాస్య సీమంతం ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అదీగాక బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ కూడా లాస్య సీమంతం వీడియో షేర్ చేయడం విశేషం. గీతూనే కాకుండా సీరియల్ తారలు శ్రీవాణి, సుష్మ కూడా వేడుకలో పాల్గొన్నారు. రీసెంట్ గా లాస్య తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా సైలెంట్ గా సీమంతం జరుపుకుంది. మరి యాంకర్ లాస్య సీమంతం జరుపుకుంది. కాబట్టి.. మీ విషెష్ ని కామెంట్స్ లో తెలియజేయండి.