యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్ సేన్ మధ్య చోటు చేసుకున్న వివాదం గురించి అందరికి తెలిసిందే. తన సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేయడం.. దానిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఈ సంఘటనపై దేవి నాగవల్లి డిబెట్ నిర్వహించింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్- దేవి నాగవల్లి మధ్య మాటల యుద్ధం రాజుకోవడం.. ఆ తర్వాత విశ్వక్ బూతులు వాడటంతో.. అది కాస్త పెను వివాదానికి దారి తీసింది. ఇక ఈ వివాదంలో కొందరు దేవి నాగవల్లిని సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు విశ్వక్‌సేన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. మరోవైపు దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ తమ తమ రోటిన్ లైఫ్‌లో బిజీ అయ్యారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen vs Devi: దేవి vs విశ్వక్: చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు..?
విశ్వక్ సేన్ తను నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదల అవ్వడంతో మూవీ రిజల్ట్ గురించి ఆతృతగా ఎదురు చూస్తుండగా.. దేవి తన జర్నలిస్ట్ లైఫ్‌లో బిజీ అయిపోయంది. ఈ క్రమంలో తాజాగా దేవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. వీడియోకి దేవి ఇచ్చిన కాప్షన్ పలువురుని ఆకట్టుకోవడమే కాక ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viswak Sen: దానం నాగేందర్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్ సేన్!
దేవి షేర్ చేసిన ఈ వీడియో ఎక్కడ తీశారు అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. కానీ వీడియోలోని ప్రదేశాలను చూస్తే.. ఎక్కడో ఆలయంలో దీన్ని తీసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక గుడి మెట్ల మీద ఓ వృద్ధురాలు కూర్చుని.. గుడి లోపలకి వెళ్లే వారిని.. బయటకు వచ్చేవారిని దానం చేయమని కోరుతుంది. కానీ ఎవరు ఆమెను పట్టించుకోరు. పైగా ఇదే సమయంలో ఆలయంలోకి వెళ్లే వారంతా.. మెట్లు ఎక్కేముందు.. వాటి మీద కొన్ని బియ్యం పోసి.. దండం పెట్టుకుని పైకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిపోయే వారు.. ఆ బియ్యం గింజల మీదుగానే నడుచుకుంటూ వెళ్తున్నారు. మనసులను మెలిపెట్టే ఈ దృశ్యాన్ని చూసి చలించిన దేవి.. ‘‘ఆ బియ్యాన్ని అలా కింద పోసే బదుల ఆమె దోసిలిలో పోస్తే.. వాటికి సార్థకత లభించేది’’ అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: Devi Nagavalli: 2 రోజులు తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చున్నాను: దేవి నాగవల్లి
ఈ వీడియో చూసిన జనాలు దేవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఆమె అసలు స్వభావం ఇదే. సమాజం గురించి ఎంతో ఆలోచిస్తుంటుంది. ఆమె ఎంత ధైర్యవంతురాలో.. అంతే సున్నిత హృదయం కలిగిన వ్యక్తి. తన కళ్ల ముందు చోటు చేసుకునే ఇలాంటి సంఘటనలు చూసి కదిలిపోతుంటుంది’’ అంటూ ఓ రేంజ్‌లో దేవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.