యాంకర్ అనసూయలో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉన్నట్టుండి ఆమె తండ్రి సుదర్శన్ రావు కొద్దిసేపటికి క్రితమే మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబద్ లోని తార్నాకాలో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లో తీవ్ర అస్వస్థకు గురయ్యాడని, ఉన్నట్టుండి ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్దిసేపటి క్రితమే అనసూయ తండ్రి సుదర్శన్ మరణించినట్లు తెలుస్తోంది.
ఈ విషమం తెలుసుకున్న యాంకర్ అనసూయా హుటాహుటిన తన తండ్రి నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. స్వయంగా అనసూయ తండ్రి మరణించడంతో సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. అయితే బుల్లితెరపై యాంకర్ గానే కాకుండ అడపదడపా సినిమాల్లో చేస్తూ అనసూయ దూసుకుపోతోంది.