సాధారణంగా షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ షాప్స్ ని సినీ సెలబ్రిటీలతో ఓపెనింగ్ చేయిస్తుంటారు వ్యాపారులు. వాళ్ళ బిజినెస్ పరంగానే సెలబ్రిటీలను ఆహ్వానించినా.. ఆయా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అందుబాటులో ఉంటే మాత్రం.. అక్కడికి వచ్చే సెలబ్రిటీలను చూసేందుకు ఫ్యాన్స్, జనాలు పెద్ద ఎత్తున ఎగబడుతుంటారు. ముఖ్యంగా హీరోలు విషయం పక్కన పెడితే.. హీరోయిన్స్ వస్తే షాపింగ్ మాల్స్ వద్ద హంగామా మామూలుగా ఉండదు. హీరోయిన్స్ కంటే కూడా మాస్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు వస్తే.. ఆ కిక్కే వేరని అంటుంటారు. మరి ఫ్యాన్స్ కి అంత కిక్కిచ్చే బ్యూటీలలో యాంకర్ అనసూయ ఒకరని అంటున్నారు ప్రేక్షకులు.
అవును.. అనసూయ హీరోయిన్ కాకపోవచ్చు. కానీ, తెలుగు రాష్ట్రాలలో ఆమెకు హీరోయిన్స్ ని మించిన క్రేజ్ ఉందని విషయం తెలిసిందే. అనసూయ సోషల్ మీడియాలో, టీవీ షోలలో కనిపిస్తేనే ఫ్యాన్స్ సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటిది ఏకంగా తమ ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తుందని తెలిస్తే.. ఆ ఏరియాలో ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా అనసూయ ఫ్యాన్స్ కి అలాంటి అనుభవమే ఎదురైంది. శ్రీకాళహస్తిలో గ్లామర్ బ్యూటీ అనసూయ.. గ్రాండ్ గా బాలాజీ షాపింగ్ మాల్ రిబ్బన్ కట్ చేసింది. ప్రస్తుతం అనసూయ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా.. గ్లామరస్ బ్యూటీ కాబట్టి, అనసూయని చూసేందుకు జనం భారీ స్థాయిలో తరలివచ్చారు. విజువల్స్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. స్కై బ్లూ కలర్ శారీలో అనసూయ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొంది. అంత రద్దీలో కూడా ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇవ్వడమే కాకుండా.. లాస్ట్ లో చిన్నగా డాన్స్ కూడా చేయడం విశేషం. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. ప్రెజెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటిగా మారిపోయింది. ఓవైపు టీవీ షోలను హోస్ట్ చేస్తూనే.. మరోవైపు చిన్న సినిమాల నుండి పాన్ ఇండియా సినిమాల వరకు అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. మరి అనసూయ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.