హనీ రోజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆమె బయటకు వచ్చిందంటే చాలు కుర్రాళ్లు తేనె తుట్ట మీద తేనెటీగల్లా మూగిపోతారు. ఇక ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కో వెళ్తే.. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు. అంత క్రేజ్ హనీది. అయితే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే హనీ రోజ్ భారీగానే ఛార్జ్ చేస్తుందని సమాచారం.
సినిమా ప్రమోషన్స్ అనేవి సినిమా కోసం.. మరి బయట ప్రమోషన్స్.. మనీ కోసం చేస్తుంటారు. సినీతారల ప్రమోషన్స్ అంటే సినిమాలలోనే కాదు.. బయట కూడా బాగా పాపులర్ అవుతుంటాయి. ఈ విషయంలో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ హనీ రోజ్ ని గ్యాప్ లేకుండా బుక్ చేసుకుంటున్నారు వ్యాపారవేత్తలు. వీరసింహారెడ్డి మూవీ తర్వాత హనీ రోజ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సాధారణంగా షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ షాప్స్ ని సినీ సెలబ్రిటీలతో ఓపెనింగ్ చేయిస్తుంటారు వ్యాపారులు. వాళ్ళ బిజినెస్ పరంగానే సెలబ్రిటీలను ఆహ్వానించినా.. ఆయా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అందుబాటులో ఉంటే మాత్రం.. అక్కడికి వచ్చే సెలబ్రిటీలను చూసేందుకు ఫ్యాన్స్, జనాలు పెద్ద ఎత్తున ఎగబడుతుంటారు. ముఖ్యంగా హీరోలు విషయం పక్కన పెడితే.. హీరోయిన్స్ వస్తే షాపింగ్ మాల్స్ వద్ద హంగామా మామూలుగా ఉండదు. హీరోయిన్స్ కంటే కూడా మాస్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు వస్తే.. ఆ కిక్కే […]