అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై సందడి చేసే టాప్ యాంకర్లలో అనసుయా ఒకరు. ఆమె తనదైన పంచ్ లతో షోల్లో సందండి చేస్తుంది. యాంకర్ గా బిజీగా ఉంటూనే మరొకవైపు సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలోను సైతం అనసూయా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియ ద్వారా తన అభిమానలుకు షేర్ చేస్తుంది. అలానే నిత్యం వివాదలకు దగ్గరగా ఉంటుంది. తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా విమానంలో తనకు జరిగిన ఓ ఊహించని ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అనసూయ పోస్టు ప్రస్తుతం నెటింట్లో తెగ వైరల్ అవుతోంది.
అనసూయ భరద్వాజ్.. విమాన సిబ్బంది చేసిన పనికి షాక్ గురైంది. సిబ్బంది ప్రయాణీకులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని ఇబ్బంది పెట్టకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆ పోస్టులో ఏం రాసిందంటే…” అలయన్స్.9ఐ విమాన ప్రోటోకాలతో చాలా ఇబ్బంది పడ్డాను. ఫైట్ నెం.. 9I517.. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు సాయంత్రం 6.10 గంటలకే పరుగులు పెట్టించారు. విమానం లాస్ట్ కాల్ 6.20 గంటలకు అని అనౌన్స్ చేశారు. అయితే టికెట్ లో విమానం బోర్డింగ్ సమయంలో 18.55 అని ఉంది. విమానం టేకాఫ్ సమయం టైమ్ 19.25 గంటలు. మేం బస్సులో అరగంట పాటు వేచి ఉన్నాము. చివరకు విమానం వద్దకు అనుమతించారు.
విమానం ఆగి ఉండగానే నా పిల్లలతో పరుగులు పెట్టాను. మాస్క్ లేదనే కారణంతో వేయిట్ చేయించారు. చివరకు మాస్కులు ధరించి విమానం లోపలికి వెళ్తే.. అక్కడ కూడా ఒక్కొక్కరిని ఒక్కో చోట కూర్చోబెట్టారు. మేము ఫ్యామిలీగా ఒకే చోట కూర్చునేలా నాలుగు టికెట్స్ బుక్ చేస్తే.. సిబ్బంది వేరు వేరుగా కూర్చోబెట్టిందని అనుసూయ అసహనం వ్యక్తం చేసింది. ఇక ఆ ఫైట్ సీట్లు సరిగా లేవు. ఆ సీట్ల వలన నా షర్ట్ కూడా చిరిగిపోయింది. మీరు ప్రయాణీకులకు చెప్పే ముందు మీరు సరిగ్గా ఉండండి” అంటూ అనసూయ మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.