తెలుగులో మోస్ట్ పాపులర్, హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. బుల్లితెర మీద పలు షోలు చేస్తూ.. సినిమాల్లోకి ప్రవేశించింది. క్షణం, రంగస్థలం సినిమాల్లో చేసిన పాత్రలు అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పాయి. ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యింది అనసూయ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఇక వివాదాల్లో చిక్కుకోవడం కూడా ఆమెకు కొత్త కాదు. లైగర్ మూవీ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె చేసిన రచ్చ.. నెటిజనుల రియాక్షన్ గురించి అందరికి తెలుసు. ఎవరు ఎమనుకున్నా పట్టించుకోకుండా.. ముక్కుసూటిగా ముందుకు వెళ్తుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ తానా వేడుకల్లో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లింది. దీపావళి పండుగ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
కాగా తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవ్వడమే కాక.. దానిలో ఉన్న వ్యక్తి ఎవరో అర్థం కాక నెటిజనులు తెగ ఇది అవుతున్నారు. పైగా అతడిని ఉద్దేశించి అనసూయ చేసిన కామెంట్స్ చేస్తే.. వీరిద్దరు చాలా క్లోజ్ అని అర్థం అవుతుంది. నా సంరక్షకుడు, నా ఫ్రెండ్.. నేను జెర్రి అయితే తను టామ్ అవుతాడు.. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అతడి గురించి రాసుకొచ్చింది అనసూయ. ఇక ఇది చూసిన నెటిజనులు అనసూయకు ఇంత క్లోజ్ అయిన ఈ వ్యక్తి ఎవరా అని ఆరా తీయసాగారు.
అతగాడి పేరు ఉజ్వల్ కస్టాల అని అనసూయ తన పోస్ట్‌లో పేర్కొంది. అతడిని అమెరికా టూర్‌లో కలిసింది అనసూయ. పుట్టిన రోజు సందర్భంగా ఉజ్వల్ బర్త్‌డే పార్టీలో పాల్గొన్న అనసూయ.. అతడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. బర్త్‌డే విషేస్ తెలిపింది. ఉజ్వల్‌తో ఫోటో దిగిన తీరు, బర్త్ డే విషెస్ చెప్పిన తీరు చూస్తుంటే అనసూయకు అతడు చాలా క్లోజ్ అని అర్థం అవుతుంది. ఈ క్రమంలో ఉజ్వల్ ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టారు ఆమె అభిమానులు. ఉజ్వల్ ప్రొఫైల్ ప్రైవేట్ కావడంతో లాకై ఉంది.
ఉజ్వల్ గురించి తెలుసుకోవడం కోసం గూగుల్‌లో సర్చ్ చేయగా.. అతడి వివరాలు కొన్ని తెలిసాయి. ఉజ్వల్ నటుడని అర్థం అవుతోంది.. అడివి శేష్ దర్శకత్వంలో 2013లో విడుదలైన ‘కిస్’ మూవీలో ఉజ్వల్ నటించాడు. తర్వాత అతడు మరో సినిమాలో నటించినట్లు ఎక్కడా లేదు. అతడు అమెరికాలో ఉండటంతో.. ప్రస్తుతం తానా వేడుకల కోసం అమెరికా వెళ్లిన అనసూయ.. అతడిని కలిసింది. బర్త్‌డే కూడా రావడంతో.. అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అనసూయ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అనసూయ నటించిన ఖిలాడి, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ చిత్రాలు ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనసూయ.. పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తుంది. అలానే వెబ్ సిరీస్‌ల్లో కూడా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.