టాలీవుడ్ స్టార్ నటుల్లో అనసూయ ఒకరు. అందంతో పాటు అభినయంతోనూ ఆమె ఎందరో ఫ్యాన్స్ అభిమానాన్ని సంపాదించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. తాజాగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.
టాలీవుడ్ స్టార్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. చలాకీదనం, హుషారైన మాటలతో మంచి క్రేజ్ సంపాదించింది. అనసూయ అందం గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది అనసూయ. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో ఆమె చూపించిన అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘పుష్ప’ చిత్రంతో ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. తాజాగా తన ఫ్యామిలీతో కలసి దిగిన ఫొటోలను షేర్ చేసింది.
స్విమ్మింగ్ పూల్‌లో భర్త, పిల్లలతో కలసి బికినీలో సందడి చేసింది అనసూయ. ఇందులో ఆమె అందాలు చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అనసూయ ఇంత అందంగా ఉన్నావేంటని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతవరకు ఎప్పుడూ బికినీలో కనిపించని అనసూయ.. ఇలా ఒకేసారి అందాల జాతరకు తెరలేపడంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బ్యాక్ అందాలతో పాటు పరువాలు కనిపించేలా ఆమె వేసుకున్న బికినీ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, అనసూయ చేస్తున్న మూవీస్ విషయానికొస్తే.. ఆమె ఇటీవల ‘రంగమార్తాండ’ చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించింది. అనసూయ నెక్స్ట్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.