ఒక స్టార్ సింగర్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కొందరి కోసం ఏకంగా 10 వేల ‘ఆదిపురుష్’ మూవీ టిక్కెట్లను ఆమె కొనుగోలు చేశారు.
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకే సుపరిచితుడైన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ‘బాహుబలి’ సిరీస్‌తో పాటు ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు ఆయన్ను నార్త్ ఆడియెన్స్‌కు దగ్గర చేశాయి. ఇప్పుడు ప్రభాస్ నుంచి మూవీ వస్తోందంటే చాలు.. తెలుగు స్టేట్స్లో ఉన్న సందడే ఉత్తరాదిలోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మారుతి డైరెక్షన్లో ‘రాజా డీలక్స్’ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఆయన యాక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఓం రౌత్ రూపొందించిన ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఈ నెల 16వ తేదీన వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుదల కానుంది. ‘ఆదిపురుష్’ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు మూవీ టీమ్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేయలేదు. ఇంటర్వ్యూలు లాంటివి చేయకపోయినా.. టీజర్, ట్రైలర్స్‌తో సినిమాపై మరింత హైప్‌ను పెంచారు. ఇక, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో ‘ఆదిపురుష్’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
‘ఆదిపురుష్’ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ‘ఆదిపురుష్’తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ఆరంభమైంది. రామాయణ కథతో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ను ఇప్పటి ప్రజలు, పిల్లలకు చేరువ చేసేందుకు ఈ మూవీతో సంబంధం లేని స్టార్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ‘ఆదిపురుష్’ను ఫ్రీగా చూపిస్తానని మాటిచ్చారు. అంతేగాక అందుకోసం 10 వేల టికెట్స్ బుక్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టికెట్స్ బుక్ చేస్తానని చెప్పారు. తాజాగా ఈ జాబితాలో మరో సెలబ్రిటీ చేరారు. ప్రముఖ బిజినెస్‌మన్ కుమార్ మంగళం బిర్లా కూతురు, బాలీవుడ్ స్టార్ సింగర్ అనన్య బిర్లా కూడా ‘ఆదిపురుష్’ సినిమా 10 వేల టిక్కెట్లు బుక్ చేస్తానని తెలిపారు. పేద పిల్లల కోసం ఆమె ఇన్ని టిక్కెట్లను కొనుగోలు చేశారు. దీంతో అనన్య బిర్లాపై నెట్టింట ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
After #RanbirKapoor, #AnanyaBirla comes on board to support #Adipurush. Ready to donate 10,000 tickets to underprivileged.#AdipurushOnJune16th #Adipurush pic.twitter.com/Neqf6kUnSY
— Fukkard (@Fukkard) June 12, 2023