ఒళ్ళంతా హూనం చేసుకుని సంపాదించుకున్న డబ్బుని ఏదో ఒకటి చేయాలి కదా. లైఫంతా కష్టపడతా కూర్చుంటే ఎంజాయ్మెంట్ ఎవరు చేత్తారు? లైఫన్నాక లైఫ్ అంత కాకపోయినా లైఫ్ బాయ్ సోపంత ఎంజాయ్మెంట్ ఉండాలని పెద్దలన్నారు. అందుకే సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు కష్టపడినంత సేపు కష్టపడి.. బ్రేక్ దొరికితే వినోదానికి ప్రియారిటీ ఇస్తారు. షూటింగ్ ల్లో ఒళ్ళంతా హూనం చేసుకుని సంపాదించిన డబ్బు.. తమ ఒంటి కోసం కాకపోతే ఇంక దేని కోసం ఖర్చుపెట్టుకుంటారు. అందుకే గ్యాప్ దొరికితే ట్రిప్ ల పేరుతో ఐలాండ్స్ లోనో, విదేశాల్లోనే వాలిపోతుంటారు. తాజాగా హాట్ బ్యూటీ అమలాపాల్ మాల్దీవులకు వెళ్ళింది.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తమిళ, మలయాళ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. రీసెంట్ గా ‘విక్టిమ్: హూ ఈజ్ నెక్స్ట్’ అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిందీ బోల్డ్ బ్యూటీ. అయితే కాస్త గ్యాప్ దొరికిందేమో, అమ్మడు లగేజ్ ప్యాక్ చేసుకుని మాల్దీవుల్లో దర్శనమిచ్చింది. వెళ్తే వెళ్ళింది, కుర్రాళ్ళని రెచ్చగొట్టేలా ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలే ఇప్పుడు కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ‘సన్ సియమ్ ఇరు వెలి’ అని ప్రొనౌన్సియేషన్ కి కూడా అందని రిసార్ట్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. అక్కడ బీచ్ దగ్గర నిలుచుని, కూర్చుని, పడుకుని ఫోటోలు తీయించుకుంది. ఓరి బాబోయ్ బేబీని ఆ ఫోటోల్లో చూస్తుంటే కళ్ళు జిగేలుమంటున్నాయి.
మొదటిసారి ఒక్క క్షణం కన్ను మూస్తే పాపం అనిపించేంత అందంగా అమ్ము బేబీ హాట్ అందాలతో కవ్విస్తోంది. చెప్పడానికి వీల్లేని శరీర భాగాలని ఎక్స్ పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. అమలాపాల్ అంటే బిఫోర్ డైవర్స్, ఆఫ్టర్ డైవర్స్ అనేలా తయారైంది. భర్తతో విడిపోక ముందు ఇంత ఘాటు లేదు. ఎప్పుడైతే భర్త నుంచి విడిపోయిందో రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతుంది. గతంలో కంటే అందాల విందు, పరువాల విందు పెంచుకుంటూ పోతోంది. క్యారీ బ్యాగ్ ఒకటి చేత్తో పట్టుకుని.. వయ్యారంగా ఫోజులిచ్చింది. ‘ఏ నేను నచ్చలేదా, ఏది నన్ను చూసి చెప్పు ఆ మాట’ అన్నట్టు కూర్చుని ఫోజు ఇచ్చింది. ఈ బీచే నా థెరపిస్ట్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసిందండోయ్. అమ్మడుకి బీచ్ ని మించిన గొప్ప చికిత్స లేదని చెబుతూ.. ఫోటోలను షేర్ చేసింది అంతే. షేర్ చేసిన నాలుగు నిమిషాల్లోనే నాలుగు గోడల మధ్య ఉన్న కవులందరూ బయటకొచ్చి మరీ అమ్మడు అందాలని వర్ణించేస్తున్నారు. మరి అమ్మడి అందాలకి మీ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయితే మీ కవిత్వంతో ఈ అప్సరసని వర్ణించేయండి.