టాలీవుడ్‌లో మోస్ట్ రొమాటింక్ కపుల్ జాబితాలో.. ముందు వరుసలో ఉంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆయన భార్య స్నేహా రెడ్డి. వీరిద్దరి క్యూట్ రిలేషన్ తెలియాలంటే వారి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. బన్నీ సంగతి ఏమో కానీ.. స్నేహా రెడ్డి మాత్రం.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. బన్నీ, పిల్లల ఫోటోలు మాత్రమే.. తన ఫోటో షూట్స్‌కి సంబంధించిన ఫోటోలను కూడా తరచుగా షేర్ చేస్తుంటుంది. ఇక డ్రెస్సింగ్ స్టైల్లో.. భర్తకు పోటీ ఇస్తుంటుంది స్నేహా రెడ్డి. ట్రెడిషనల్, ట్రెండీవేర్.. అన్ని రకాల కాస్ట్యూమ్స్‌లో సూపర్బ్‌గా ఉంటుంది. స్నేహ రెడ్డి ఫోటోలను చూస్తే.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మతి పొగొడుతుంది. స్నేహా రెడ్డికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి.
తాజాగా స్నేహారెడ్డి.. షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. బన్నీతో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూస్తే.. వీరు ఏదో వెకేషన్‌లో ఉన్నట్లు అర్థం అవుతోంది. న్యూఇయర్ వేడుకల కోసం అల్లు పరివారమంతా వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇప్పటికే కొంత షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా కోసం.. ఇప్పుడు బన్నీ పూర్తిగా అదే గెటప్పులో ఉండాల్సి వస్తుంది. తాజాగా స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటోలో.. బన్నీని తన కౌగిలిలో బంధించింది. ఈ పిక్ బన్నీ గుబురు గడ్డం, జుట్టుతో ఉన్నాడు. ఇక ఈ ఫోటోలో.. ఎప్పటిలానే.. స్నేహా రెడ్డి మాత్రం అందంగా కనిపించింది. ఈఫోటో చూసిన అభిమానులు.. వావ్.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
@AlluArjun 🖤 pic.twitter.com/RZjHaYZ1Xj
— Allu Sneha Reddy (@AlluSnehaReddy_) December 26, 2022