టాలీవుడ్‌లోనే కాక.. దేశవ్యాప్తంగా స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఆయన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్‌కి ఎంతో మంది అభిమానులున్నారు. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం బన్నీ స్టైల్‌కి పడిపోతారు. మరి స్టైలిష్ స్టార్ భార్య అంటే.. ఆయనకు తగ్గట్టుగానే ఉండాలి కదా. డ్రెస్సింగ్ విషయంలో బన్నీతో పోటీ పడుతుంటుంది ఆయన భార్య స్నేహారెడ్డి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో.. ట్రెండ్‌కి తగ్గట్టు డ్రెస్ చేసుకుంటుంది. బన్నీ, స్నేహారెడ్డిలను చూస్తే.. ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ స్టార్ కపుల్ అన్న బిరుదు వారికి చక్కగా సరిపోతుంది అనిపిస్తుంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వీరు నిరూపించారు కూడా. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో.. బన్నీ దంపతులు స్టైలీష్ లుక్‌తో అందరికి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి స్నేహారెడ్డి డ్రెస్సింగ్ సెన్స్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోల్లో ఆమె వెండి రంగు చీరంలో మెరిసిపోయారు. ఇక చీర పల్లు వచ్చి.. లతలన్నింటిని పక్కపక్కన చేర్చితే ఎంత అందంగా ఉంటుందో అలా డిజైన్ చేశారు. లైట్ మెకప్‌తో ఎలాంటి ఆభరణాలు ధరించనప్పటికి.. చీరలోనే అల్ట్రామోడ్రన్ లుక్‌లో మెరిసిపోయింది స్నేహారెడ్డి. ఇక ఈ చీరను రిమ్‌జిమ్ దాదు డిజైన్ చేయగా.. ప్రీతమ్ జుకల్కర్ తననింత స్టైలిష్‌గా రెడీ చేశాడని చెప్పుకొచ్చింది స్నేహా రెడ్డి.
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజనులు.. ఎంత అందంగా ఉన్నారు.. హీరోయిన్లు కూడా మీ ముందు దిగదుడుపే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక.. చీర ఖరీదు ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇక స్నేహారెడ్డి ధరించిన ఈ చీర ఖరీదు తెలిస్తే.. ఆశ్చర్యంతో కాసేపు అలా బిగుసుకుపోతారు. ఎందుకంటే.. ఈ చీర ఖరీదు ఏకంగా లక్షా డెబ్బై ఆరు వేల రూపాయలట(1,76,000). చీర ధర తెలిసిన తర్వాత చాలా మంది నెటిజనులు.. మరీ ఇంత ఖరీదా.. అంటే ఆ చీరను వెండితో రూపొందించారా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.