తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. మొదటి చిత్రం గంగోత్రి తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత వచ్చి ఆర్య చిత్రంతో మెగా హీరో అంటే ఏంటో చూపించాడు. ఆర్య హిట్ తర్వాత అల్లు అర్జున్ వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్, కామెడీ ఎలాంటి పాత్ర అయినా తన మార్క్ చూపిస్తుంటాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ మాస్ లుక్.. మేనరీజం, డైలాగ్స్ తో దుమ్మురేపాడు.
పుష్ప రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలికే తగ్గేదే లే డైలాగ్.. చూపే బంగారమాయనే అనే సాంగ్ దేశ విదేశాల్లో తెగ పాపులర్ అయ్యాయి. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు ఈ డైలాగ్స్ కొడుతూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. పుష్ప రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాలీవుడ్ లో ఏకంగా వందకోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ షూటింగ్ కొనసాగుతుంది.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గత కొంత కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర టీమ్ సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్ ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. ఈ క్రమంలో పుష్ప 2 షూటింగ్ లో కాస్త విరామం దొరికింది. ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తారని అంటారు.
షూటింగ్ లో ఏమాత్రం గ్యాప్ దొరికినా భార్యా పిల్లలతో విదేశాలకు టూర్ వెళ్లిపోతాడు. అప్పుడప్పుడు తన భార్య స్నేహారెడ్డితో సరదాగా హైదరాబాద్ లో కార్లో షికార్లు కొడతాడు బన్ని. తన భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ హైదరాబాద్ లో లేట్ నైట్ రొమాంటిక్ డ్రైవ్ కి వెళ్లినట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Night Drive video of Icon Star #AlluArjun shared by wife Sneha Ma’am on Insta.#Pushpa #PushpaTheRule pic.twitter.com/fUL3zvPTQo
— Arjun 🪓 (@ArjunVcOnline) November 8, 2022