ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బన్నీకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో తెలుగు రాష్ట్రాలు, కేరళలో బన్నీకి అత్యధికంగా అభిమానులు ఉండేవారు. కానీ, పుష్ప సినిమా తర్వాత మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు అభిమానులు అయ్యారు. అసలు బాలీవుడ్ అభిమానులు అయితే అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇమిటేట్ చేస్తూ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం చూశాం.
ఇంతటి స్టార్డమ్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో అల్లు అర్జున్ క్రేజ్ ఎంత పెరిగిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు అన్ని ప్రముఖ కంపెనీలు అల్లు అర్జున్ వెనుక పడుతున్నాయి. ఎంత అడిగినా ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ యాడ్ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవ్వడం చూశాం. యాడ్స్ కోసం రోజుకు రూ.7.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఆ సందర్భంగానే ఇప్పుడు ఇంకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో అల్లు అర్జున్ ఓసారి కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా పొగాకు ఉత్పత్తుల యాడ్ చేయనని చెప్పాడు. ఎందుకంటే తనని చూసి అభిమానులు అలా చేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారని చెప్పాడు. అయితే ఇటీవల మరో బ్రాండుకు బన్నీ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ విస్కీ బ్రాండ్ తమకు బ్రాండింగ్ చేయమని కోరగా బన్నీ నో చెప్పాడు. అందుకు వాళ్లు రూ.10 కోట్లు ఆఫర్ చేయగా బన్నీ సున్నితంగా తిరస్కరించాడు.
అభిమానులు, వారి ఆరోగ్యం కోసం అల్లు అర్జున్ కోట్ల రూపాయలను ఇలా త్యాగం చేయడం చూసి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసిస్తోంది. అల్లు అర్జున్ ఊరికే ఐకాన్ స్టార్ అయిపోలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంక, పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కథ మీద ఎన్నో ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా అద్భుతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం బన్నీ యాడ్స్ ఒప్పుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Stylish Icon Star Allu Arjun Has Rejected a International Whiskey Brand Offer pic.twitter.com/pXU6JHrZjb
— Shanto Kumar Megh (@ShantoMegh) August 11, 2022