Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చుకున్నారు అల్లుఅర్జున్. ఆ సినిమాలో తన మ్యానిరిజం, ఊర మాస్ యాటిట్యూడ్‌తో హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. చిన్న నుంచి పెద్ద దాకా ‘ఝుకుంగా నై(తగ్గేదేలా) అన్న డైలాగ్‌ను వాడేస్తున్నారు. అల్లు అర్జున్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ పొగాకు కంపెనీ తమకో యాడ్ చేసి పెట్టమని అడిగిందంట. తమ ప్రాడక్ట్‌ను ప్రమోట్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ఆఫర్ చేసిందంట. ఆయన తీసుకునే కమర్శియల్ యాడ్ డబ్బులకంటే ఎక్కువగా దాదాపు రూ. 6 కోట్లు ఇస్తామని అన్నదంట.
అయితే, అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానన్నా ఆయన ఆ యాడ్ చేయటానికి ఒప్పుకోలేదంట. తాను పొగాకును ప్రమోట్ చేస్తే తన అభిమానులు వాటిని తీసుకుంటారని, తద్వారా వారి జీవితం పాడవుతుందని అన్నారంట. ఫ్యాన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్లు కాదనుకున్న అల్లుఅర్జున్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతేకాక బాలీవుడ్ హీరోల మీద ఇదే అంశంపై విమర్శలు చేస్తున్నారు నెటిజనులు. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి హీరోలు అల్లు అర్జున్ ని చూసి నేర్చుకోవాలని.. డబ్బు కోసం ఏది పడితే అది చేయడకూడదు అంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. మరి కొద్దిరోజుల్లో సినిమా షూటింగ్లో పాల్గొంటారు. మరి, అల్లు అర్జున్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tollywood Actor Allu Arjun was offered a large payment for an endorsement by a Pan Masala brand, but he rejected the offer.
This is what Bollywood actors Ajay Devgan, Shahrukh Khan and Akshay Kumar need to learn from him.
— Anshul Saxena (@AskAnshul) April 20, 2022
ఇవి కూడా చదవండి : క్యాష్ షోలో రచ్చ రవిపై సుమ సీరియస్! స్టుపిడ్ అంటూ…!