అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇటీవల కాలంలో విడుదలైన ఈ చిత్రం అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించి తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచింది. ఇక ఈ సినిమాతో నటుడిగా అల్లు అర్జున్ ఇంకో మెట్టు ఎక్కినట్లైంది. అయితే పుష్పకు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతున్న విషయం తెలిసిందే.
కాగా ఇందులో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండనుందనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 2లో అల్లు అర్జున్ 55 ఏళ్ల వయస్కుడిగా కనిపించనన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పార్ట్ 2 లో కొన్ని నిమిషాల పాటు ఈ గెటప్ లో బన్నీ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ గెటప్ కు సంబంధించి చిత్ర యూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Udaya Bhanu: చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు యాంకర్ ఉదయభాను!
ఇక మరో విషయం ఏంటంటే? 55 ఏళ్ల వయస్కుడిగా బన్నీ కనిపించనుండడంతో ఈ లుక్ సినిమాకే హై లెట్ గా ఉండనుందని తెలుస్తోంది. మరి నిజంగానే బన్నీ 55 ఏళ్ల వయస్కుడిగా కనిపించనున్నాడనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. బన్నీ ఈ లుక్ లో కనిపిస్తాడని తెలియడంతో ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అల్లు అర్జున్ 55 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.