ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నారు. ఎందుకంటే బన్నీ పేరు చెప్పగానే ప్రస్తుతం అయితే ‘పుష్ప’ సినిమానే గుర్తొస్తుంది. ఈ మూవీతో వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయాడు. సీక్వెల్ కోసం అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే అల్లు అర్జున్.. వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటి వరకు వరసపెట్టి అవార్డులు సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తనని నమ్ముకున్న వారికి అల్లు అర్జున్ ఎలాంటి సాయం చేస్తాడో ఈ ఇన్సిడెంట్ తో ప్రూవ్ అయింది. వరంగల్ కి చెందిన మహిపాల్.. బన్నీ దగ్గర పదేళ్ల నుంచి డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయన బోరబండలో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి నిర్మాణానికి తన వంతు సాయంగా అల్లు అర్జున్, రూ.15 లక్షలు అందజేశాడు. ఈ విషయాన్ని చెబుతూ డ్రైవర్ ఫ్యామిలీతో బన్నీ తీసుకున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇక బన్నీకి తన డ్రైవర్ పట్ల ఉన్న అభిమానం, బాధ్యతని చూసిన అతడి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. బన్నీ అంటే ఇది అని ట్విట్టర్ లో మోత మోగిస్తున్నారు.
అల్లు అర్జున్ చేసిన మరో మంచిపని కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. కేరళలో ఓ స్టూడెంట్ చదువు పూర్తిచేయడానికి అల్లు అర్జున్ ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అలెప్పీ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణతేజ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అలెప్పీకి చెందిన ఓ ముస్లిం విద్యార్థిని బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ తెచ్చుకుంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అల్లు అర్జున్ కి తెలియజేశారు. దీంతో బన్నీ.. ఆమె నాలుగేళ్ల పాటు కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఇలా రోజుల వ్యవధిలో అల్లు అర్జున్ చేసిన మంచి పనులు చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
శభాష్ అర్జున్..టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఓ మహిపాల్ బోరబండలో ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన మహిపాల్ 10ఏళ్లుగా అర్జున్ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. @alluarjun #AlluArjun pic.twitter.com/rVgiuH9fA3
— DONTHU RAMESH (@DonthuRamesh) November 11, 2022