ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ నాయనమ్మ, మెగాస్టార్ చిరు అత్తయ్య కనకరత్నం మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి అత్తయ్య, అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నం ఇవాళ తుది శ్వాస విడిచారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్యగా, అల్లు అరవింద్ తల్లిగా కనకరత్నం చలనచిత్ర సీమలో సుపరిచితురాలే. 94 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. అల్లు కనకరత్నం మరణవార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి అన్ని పనుల్ని రద్దు చేసుకుని అల్లు అరవింద్ ఇంటికి చేరారు.
మరోవైపు ముంబైలో అట్లి దర్శకత్వంలో సినిమా షూటింగులో ఉన్న అల్లు అర్జున్ నాయనమ్మ మరణవార్త విని వెంటనే బయలుదేరారు. ఇక మరో మనవడు రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగు స్పాట్ మైసూరు నుంచి బయలు దేరారు. అల్లు కనకరత్నం అంత్యక్రియలు ఇవాళ మద్యాహ్నం కోకాపేట్‌లో జరుగుతాయని గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అల్లు కనకరత్నం మరణవార్త విని సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Allu Kanakaratnam garu
Om shanthi 🙏 pic.twitter.com/5eUhm4FB6M— SKN (Sreenivasa Kumar) (@SKNonline) August 30, 2025