పుష్ప సినిమా భారీ విజయం తర్వాత ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్, అట్టిట్యూడ్ అన్ని డిఫరెంట్‌గా ట్రై చేసి.. అభిమానులను అలరించాడు బన్నీ. సినిమా సినిమాకు తన మేకోవర్ మార్చుకుంటూ.. కొత్త గెటప్‌లో అభిమానులను అలరిస్తున్నాడు బన్నీ. పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకునేందుకైనా వెనకాడడు. దానిలో భాగంగానే పుష్ప చిత్రంలో మాస్, చిన్న పాటి లోపం ఉన్న క్యారెక్టర్‌లో కూడా అభిమానులను అలరించాడు బన్నీ. ఈ సినిమా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్‌కు ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ‘పుష్ప’ పార్ట్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ బన్నీ.. తాజాగా తనకు లభించిన అరుదైన బహుమతిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది వైరలవుతోంది.
పుష్ప సినిమాలో బన్నీ.. మేనరిజంతో పాటు.. లారీలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసం లారీలు వాడటం.. వాటిని బావిలో దాచడం వంటి సీన్లలో లారీ కనిపిస్తుంది. ఈ క్రమంలో పుష్ప సినిమాలో కనిపించిన లారీని.. బన్నీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు ఓ క్యూట్ పర్సన్. పుష్ప రాజ్ కోసం ప్రత్యేకంగా పుష్ప లారీని స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. మరీ బన్నీకి ఇంత సూపర్ గిఫ్ట్ ఇచ్చిన పర్సన్ ఎవరంటే.. ఇంకెవరు.. ఆయన ముద్దుల కొడుకు అల్లు అయాన్. ‘నా స్వీటెస్ట్ సోల్ అయాన్ చిన్ని బాబు నుంచి అందమైన బహుమతి’ అంటూ పుష్ప బొమ్మ లారీ ఫోటోని షేర్ చేశాడు బన్నీ. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
‘పుష్ప’ చిత్రంలో బన్నీ.. లారీలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే డ్రైవర్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్ పెద్దలతో పాటు పిల్లల్లో కూడా బాగా రిజిస్టర్ అయిపోయింది. అందుకే అల్లు అయాన్ కూడా తన తండ్రికి బొమ్మ లారీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక ‘పుష్ప2’ యూనిట్ ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో రష్మిక మందాన, ఫాహద్ ఫాజిల్ ప్రధాన ప్రాతల్లో నటిస్తున్నారు. మరి అల్లు అయాన్ ఇచ్చిన గిఫ్ట్ మీకు నచ్చిందా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.