సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి నిర్మాత అల్లు అరవింద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని, ఆయన గొప్పతాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే…సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. ఆయనకు బన్నీ అంటే ఎంతో ఇష్టం అని.. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు’ అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కూడా పాటలు రాశారు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదని కన్నీటి పర్యంత అయ్యారు.