ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడు ఎవరి కాంబినేషన్స్ సెట్ అవుతాయో చెప్పలేం. కొన్ని కాంబినేషన్స్ ని మనం ఎక్స్ పెక్ట్ చేయకుండానే జరిగిపోతుంటాయి. మరికొన్ని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. కానీ.. అనుకోకుండా సెట్ అయ్యే కాంబినేషన్స్ ఆడియెన్స్ కి ఎక్కువ థ్రిల్ కలిగిస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరూ ఊహించని కాంబో సెట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడు ఎవరి కాంబినేషన్స్ సెట్ అవుతాయో చెప్పలేం. కొన్ని కాంబినేషన్స్ ని మనం ఎక్స్ పెక్ట్ చేయకుండానే జరిగిపోతుంటాయి. మరికొన్ని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. కానీ.. అనుకోకుండా సెట్ అయ్యే కాంబినేషన్స్ ఆడియెన్స్ కి ఎక్కువ థ్రిల్ కలిగిస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరూ ఊహించని కాంబో సెట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. ప్రస్తుతం ‘కాంతార 2’ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం రూ. 16 కోట్లతో రూపొందిన కాంతార.. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లు వసూల్ చేసి రచ్చ లేపింది.
దీంతో ఇప్పుడు రిషబ్ శెట్టిపై, కాంతార 2పై ప్రేక్షకులలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రిషబ్ శెట్టి తదుపరి సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి, లైగర్ సినిమాలతో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రెజెంట్ శివ నిర్వాణతో ఖుషి సినిమా చేస్తూనే.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, పరశురామ్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అయితే.. గీతగోవిందం తీసిన అల్లు అరవింద్ ప్రొడక్షన్ లోనే విజయ్ దేవరకొండ.. గీతగోవిందం 2 చేయాల్సింది. కానీ.. అనూహ్యంగా దిల్ రాజు, పరశురామ్ లతో సినిమా అనౌన్స్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అల్లు అరవింద్.
అనంతరం పలు చర్చలు జరిగాక.. విజయ్ గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడట. దీంతో.. పరశురామ్ ఎలాగో దిల్ రాజు ప్రొడక్షన్ లో కమిట్ అయ్యాడు కాబట్టి.. రంగంలోకి రిషబ్ శెట్టిని దింపే ఆలోచనలో ఉన్నాడట అల్లు అరవింద్. ఎందుకంటే.. కాంతార తెలుగులో రిలీజ్ అయ్యేటప్పుడే రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా చేస్తామని చెప్పారు. సో.. ఇప్పుడు కాంతార 2 తర్వాత.. కరెక్ట్ టైమ్ అని.. రిషబ్ శెట్టి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే మాత్రం, విజయ్ కి మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏం జరగనుందో.. మరి రిషబ్ శెట్టి – విజయ్ దేవరకొండ కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.