బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ డన లేటెస్ట్ మూవీ సెల్ఫీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీగా ఉండే అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు.
బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. ఓ వైపు యాడ్స్ లో నటిస్తూ.. వెండితెరపై తన సత్తా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అక్షయ్ కుమార్ తాజాగా తన ఇన్ స్ట్రాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు… రియల్ లైఫ్ లో కూడా చాలా హుషారుగా ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అక్షయ్ కుమార్ తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ఈ ఇద్దరు స్టార్ హీరోలు సాంప్రదాయ దుస్తుల్లో భాంగ్రా డ్యాన్స్ చేస్తూ అక్కడు ఉన్నవారిని హుషారెత్తించారు. ఈ వీడియలో ధోల్ బీట్స్ కు అనుగుణంగా ఇద్దరు హీరోలు తమ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. మోహన్ లాల్ సార్ తో డ్యాన్స్ చేసిన ఈ మధుర క్షణాలు తన జీవితాంతం గుర్తుంచుకుంటానని పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది.
ఇక అక్షయ్ కుమార్ మూవీస్ విషయానికి వస్తే.. ఆయన ‘సెల్ఫీ’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో కొత్త సాంగ్స్ తో అభిమానులను సంతోషపెట్టే పనిలో ఉన్నారు. మాలీవుడ్ స్టార్ హీరో ఫృధ్విరాజ్ సుకుమారన్ మాలీవుడ్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ కి రిమేక్ గా రూపొందింది. రాజ్ మెహతా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 24 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత అక్షయ్ కుమార్ క్యాప్సుల్ గిల్, ఓ మైగాడ్ 2 తో పాటు మరికొన్ని మూవీస్ లైన్ లో పెట్టారు.