సినిమా కూడా ఒక వ్యాపారమే. ఒక సినిమా హిట్ అయితే హీరోలు కోట్లలో పారితోషికం అందుకుంటారు. 10 కోట్ల నుంచి వంద కోట్ల దాకా పారితోషికాలు తీసుకునే హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో. డిమాండ్ ను బట్టి పారితోషికాలు ఉంటాయి. పారితోషికం ఎక్కువ వచ్చినప్పుడు ఆ డబ్బుని వేరే రంగాల్లో పెట్టుబడి పెడుతుండడం సహజమే. మహేష్ బాబు, రామ్ చరణ్ సహా అనేక మంది హీరోలు వచ్చిన ఆదాయాన్ని రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ మేన్ లుగా కూడా సత్తా చాటుతున్నారు. ఈ విషయంలో స్టార్ హీరోలే కాదు.. శర్వానంద్, సందీప్ కిషన్ లాంటి యంగ్ హీరోలు కూడా రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ అంటూ రకరకాల రంగాల్లో ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ని పొందుతున్నారు. ఇదొక్కటే కాకుండా కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు.
సినిమాలు, వ్యాపారాలు, కమర్షియల్ యాడ్స్ అన్నీ కలిపి హీరోలు సంపాదించే ఆదాయం ఏడాదికి ఇన్ని కోట్లు అని ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం కొన్ని వెబ్ సైట్లు స్టార్ హీరోలకు సంబంధించి నికర సంపాదన, ఆస్తులు వంటి వివరాలు పొందుపరుస్తూ ఉంటాయి. ఈ జాబితాలో హీరో అడివి శేష్ కూడా చేరిపోయారు. వీటిలో కొంతవరకూ నిజాలు ఉంటాయి. కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. ఒక వెబ్ సైట్ లో 2022లో అడివి శేష్ ఆదాయం ఏకంగా 450 మిలియన్ డాలర్లని రాశారు. దీన్ని భారతీయ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 3 వేల కోట్లకు పైనే. 2022లో అడివి శేష్ ఆదాయం 450 మిలియన్ డాలర్లు అని, నెలకి వచ్చే ఆదాయం రూ. 359 కోట్లు అని, అడివి శేష్ ఒక సినిమాకి 5 కోట్లు ఛార్జ్ చేస్తారని, నెలకు 4 నుంచి 5 కోట్లు ఆదాయం వస్తుందని రాసుకొచ్చారు. నెలకి 4 నుంచి 5 కోట్లు సంపాదించే అడివి శేష్.. ఏడాదికి 3 కోట్లే సంపాదిస్తున్నారని రాయడమే కామెడీగా ఉంది.
ఇదిలా ఉంచితే ఇక ఒక నెటిజన్ గూగులో అడివి శేష్ పారితోషికం ఎంత అని సెర్చ్ చేస్తే.. అడివి శేష్ ఆదాయం 450 మిలియన్ డాలర్లుగా చూపిస్తుందని.. అడివి శేష్ ని ట్యాగ్ చేస్తూ ఒక వీడియోని ట్వీట్ చేశారు. ‘గూగుల్ లో తప్పుడు సమాచారం ఉంటుందని తెలుసు. అయినా ఆపుకోలేక అడివి శేష్ పారితోషికం ఎంత అని సెర్చ్ చేస్తే.. 450 మిలియన్ డాలర్స్ అని వచ్చింది. నరాలు కట్ అయిపోయాయి తెలుసా’ అంటూ ఒక నెటిజన్ అడివి శేష్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దానికి అడివి శేష్ స్పందించారు. ‘మాకు కూడా ఆ 450 మిలియన్ డాలర్లు ఎక్కడుందో చెప్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం’ అంటూ సెటైరికల్ ట్వీట్ వేశారు. అంత పారితోషికం ఇచ్చే నిర్మాత ఉంటే బ్రేక్ ఇవ్వడానికి తాను రెడీ అని అర్థమొచ్చేలా అడివి శేష్ ట్వీట్ చేశారు.
2021లో రామ్ చరణ్ ఆదాయం 180 మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం 1400 కోట్లు అని సమాచారం. ఇక మహేష్ బాబు ఆదాయం వచ్చేసరికి 134 కోట్లు అని సమాచారం. రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్లు అంటే ఒక సినిమాకి 100 నుంచి 150 కోట్లు పారితోషికాలు తీసుకుంటున్నారు. పైగా నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. మరోపక్క బిజినెస్ లు, ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆదాయం వందల కోట్లలో ఉన్నా అర్ధం ఉంది. కానీ వీళ్లంత కాకపోయినా ఓ మాదిరి పారితోషికం తీసుకునే అడివి శేష్ 3 వేల కోట్లు సంపాదించారంటేనే ఆశ్చర్యంగా ఉంది.
ఈ లెక్కన అడివి శేష్ చరణ్, మహేష్ లని దాటేశారుగా. ఆ వెబ్ సైట్ వాడు నెలకి 4 నుంచి 5 కోట్లు సంపాదన అని రాసి.. ఏడాదికి 3 కోట్లు అని రాసినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది, వాడు తాగి రాసి ఉంటాడని అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదన్న మాట విషయం. అందుకే అడివి శేష్.. అంత పారితోషికం ఇచ్చే వాళ్ళు ఉంటే బ్రేక్ ఇవ్వడానికి నేను రెడీ అంటూ ట్వీట్ చేశారు. మరికొంతమంది నీ టాలెంట్ కి హాలీవుడ్ కి వెళ్ళిపోతే ఆ రేంజ్ లోనే పారితోషికాలు ఇస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు?
Maaku kooda aa $450M ekkadundho chepthe break ivvadaaniki ready ga unnaam. 🐶 https://t.co/27YvTzR1yx
— Adivi Sesh (@AdiviSesh) December 7, 2022