ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీ ని అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈమూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో మంచి మూవీగా ఉండబోతుందని అన్నారు చిత్ర యూనిట్. ప్రముఖ నిర్మాత పుస్కర రామ్మోహాన రావు హీరో ఆది సాయికుమార్ పై క్లాప్ ఇవ్వగా , ప్రముఖ నిర్మాత కె.యస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ , ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
ఈ సందర్భంగా నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాన్న గారు శాంతయ్య గత 32 సంవత్సరాలుగా డిస్ట్రి బ్యూషన్ రంగంలో ఉన్నారని.. నన్ను నిర్మాతగా మారడానికి ప్రోత్సాహం అందించారని అన్నారు. దేవ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో ఆ కథ పై ఒక సంవత్సర కాలంగా పనిచేసాము. ఆది సాయికుమార్ గారు కెరియర్ లో ఈ కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.
ఇక హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. కథ బాగా నచ్చిందని.. తన కెరీర్ లో మంచి చిత్రంగా నిలుస్తుందని అన్నారు. ఇంత మంచి అవకాశం ఇప్పించిన నిర్మాత, దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ.. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఆది సాయికుమార్ గారి పాత్ర చాలా ఢిఫరెంట్ గా ఉంటుందని.. నాకు అవకాశం ఇచ్చిన ఆది సాయికుమార్,నిర్మాత అజయ్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడిగా నా ప్రయత్నం మిమ్మల్ని అందరినీ ఆనంద పరుస్తుందని నమ్ముతున్న అన్నారు.
