ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తల్లో ఒకరైన వనితా విజయ్ కుమార్ అంటే గుర్తు పట్టలేరు కానీ, వివాదాల తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఇటీవల ఆమె మరోసారి తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది. మళ్లీ పెళ్లి ద్వారా వచ్చిన ఆమె.
తెలుగులో సామాజిక ధృక్పథంతో పాటు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయడంలో దిట్ట కోడి రామ కృష్ణ. ఆయన సినిమాల్లో ఒకటి దేవి. ఈ సినిమాతో రాక్ స్టార్‌గా ఎదిగిన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పరిచయమయ్యాడు. అలాగే ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తల్లో ఒకరైన వనితా విజయ్ కుమార్ కూడా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె చూపించిన అభినయం, కట్టు, బొట్టు చూసిన వారంతా ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె అనూహ్యంగా మాయమయ్యారు. తమిళ సినిమాలతో బిజీగా మారారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా , నిర్మాత, వ్యాఖ్యాత ఇలా చాలా చేశారు. తమిళ బిగ్ బాస్ లో కనిపించారు. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ద్వారానే ఫేమస్ అయ్యారు. మూడు పెళ్లిళ్లు చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఇటీవల ఆమె మరోసారి తెలుగు సినిమాలోకి అడుగుపెట్టింది.
అదే నరేష్, పవిత్ర లోకేశ్ సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమాలో నరేశ్ మూడో భార్యగా వనిత విజయ్ కుమార్ నటించారు. ఈ సినిమాను నరేష్ తన వ్యక్తిగత జీవితం ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రమ్య రఘపతి క్యారెక్టర్‌ను ఆమెతో చేయించారు. పెళ్లి, ఇతర విషయాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే.. వనిత.. తనకు సంబంధించిన ఫోటోలనున పెడుతుంటారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది వనిత. ఇటీవల పెళ్లి చేసుకుని విడిపోయిన భర్త మరణించడంపై ఎమోషనల్ అయిన వనిత.. తన ఫ్యామిలీ తనకు అన్యాయం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లి కూచినని పేర్కొన్న ఆమె.. మంజుల బతికి ఉంటే తనకు ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. తన కుటుంబ సభ్యులే తనను వేరు చేశారని.. ఇంట నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్థి తగాదాల వల్లే తనను దూరం పెట్టారని తెలిపింది.ఇంట్లో నుంచి పోలీసులతో వెళ్లగొట్టారని తెలిపారు. ఆ సమయంలో ఎక్కడకి వెళ్లాలో తెలియక కర్ణాటక మైసూరులో రెండేళ్లు పిల్లలతో ఉన్నానని, తనకు ఫ్యామిలీ నుండే బెదిరింపులు ఉన్నాయన్నారు. ఆసమయంలో మా నాన్నకు ఫోన్ చేసి.. ఏమందీ డాడీ అనగానే… తమిళనాడులో అడుగు కూడా పెట్టనివ్వనని బెదిరించాడు అని తెలిపారు. కానీ తమిళనాడు ప్రజలు తనని ఒక కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు వనిత.