సురేఖ వాణి.. తెలుగు ప్రేక్షకులకు ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. భార్య, వదిన, తల్లి, అక్క ఇలా ఎన్నో పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల ఇంట్లో మనిషిగా మారిపోయింది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. ఇదే విషయంపై సురేఖను ప్రశ్నించగా.. తానేమీ బ్రేక్ తీసుకోలేదని, అవకాశాలు రాకనే ఖాళీగా ఉన్నానంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసింది.
సురేఖ వాణి సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. రీల్స్, ఇన్ స్టాగ్రామ్ పోస్టులతో ప్రేక్షకులను, తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కుమార్తె సుప్రితతో కలిసున్న పిక్స్ కూడా పోస్ట్ చేస్తుంటుంది. సుప్రిత అందంలో సురేఖకు వారసురాలు అనడంతో ఎలాంటి సందేహం లేదు. వీళ్లిద్దరు పెట్టే పోస్టులు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వీళ్లు పోస్ట్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అదేంటంటే.. తల్లీకుమార్తెలు ఇద్దరూ మినీ డ్రెస్సులు వేసి ఫొటోకి ఫోజులు ఇచ్చారు. సురేఖ కూడా కుమార్తెతో పోటీగా షార్ట్ డ్రస్సు వేయడంతో ఇన్ స్టాగ్రామ్ కే చెమటలు పడుతున్నాయి. వీళ్ల పిక్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ అంతా షాకవుతున్నారు. సురేఖ- సుప్రితలు తల్లీకుమార్తెలు అంటే నమ్మలేకపోతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే తల్లీకుమార్తెలుగా లేరు.. ఒకే తల్లికి పుట్టినట్లుగా కనిపిస్తున్నారంటూ తమ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
ఇంక సినిమాల విషయానికి వస్తే.. సురేఖ వాణి మూవీస్ లో అవకాశాలు లేక ఖాళీగానే ఉంటోంది. అటు సుప్రిత తన యాక్టింగ్ కెరీర్ ని ప్రారంభించేసింది కూడా. ఇప్పటికే రీల్స్, కవర్ సాంగ్స్ అంటూ అభిమానులను అలరిస్తున్న సుప్రిత మంచు లక్ష్మి లీడ్ రోల్ చేస్తున్న లేచింది మహిళా లోకం అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించి అప్ డేట్స్ మాత్రం రావడం లేదు. నటనలో తల్లి పేరును నిలబెట్టేందుకు సుప్రిత చాలానే కష్టపడుతోంది. మరి.. ఆమె ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.