బుల్లితెరపై కొత్తగా ప్రారంభమైన జగపతి బాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా సంచలనం రేపుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. నాగార్జున తరువాత టాక్ షోలో పాల్గొన్న శ్రీలీల..జగ్గూభాయ్‌కు వార్నింగ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అందం..అభినయం..అంతకుమించి డ్యాన్స్‌తో అభిమానుల్ని అలరిస్తున్న శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ ఎక్కడా తగ్గడం లేదు. టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరని చెప్పవచ్చు. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో శ్రీలీల సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. షో హోస్ట్ చేస్తున్న జగపతి బాబుకే స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. అసలేం జరిగింది.
నాగార్జునతో జయమ్ము నిశ్చయమ్మురా మొదటి ఎపిసోడ్ తరువాత శ్రీలీలతో రెండవ ఎపిసోడ్ షూట్ అవుతోంది. నాగార్జున ఎపిసోడ్‌తో జగపతి బాబు షోకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు శ్రీలీలతో రెండవ ఎపిసోడ్ ఇంకా టెలీకాస్ట్ కాకుండానే ప్రాచుర్యం పొందుతోంది. ఈ షోలో శ్రీలీల జగపతి బాబుకు వార్నింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం. ఈ షో ప్రోమో డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. జగపతి బాబు-శ్రీలీల మధ్య కౌంటర్లు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అందరూ ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకుంటే నువ్వు మాత్రం యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకు వచ్చావని జగపతి బాబు చెప్పడంతో..పొగుడుతున్నారా లేక తిడుతున్నారా అంటూ శ్రీలీల పంచ్ వేసింది.
ఇక శ్రీలీల లుక్స్ గురించి ఓ టాపిక్ చెప్పాలని అన్నప్పుుడు ఆ టాపిక్ తెస్తే నేను మీ మేటర్ బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చేసింది. అంతే..జగపతి బాబు షాక్ అయ్యాడు. ఆ తరువాత కాస్సేపటికి సర్దుకుని ఏ మేటర్ అనడంతో… మీ హీరోయిన్ గారు..మీరు అంటూ నవ్వుతూ బదులిచ్చింది. ఇంతకీ ఆ మేటర్ ఏంటి, ఏమా సంగతి తెలుసుకోవాలంటే జయమ్ము నిశ్చయమ్మురా రెండో ఎపిసోడ్ చూడాల్సిందే.
ఆ తరువాత షోకు శ్రీలీల తల్లిని తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారు. మా అమ్ము మీకు పెద్ద ఫ్యాన్ అంటూ శ్రీలీల ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే నీవెందుకు సిగ్గు పడుతున్నావనగానే ప్రేక్షకులు చప్పట్లతో సందడి చేశారు. మొత్తానికి జగపతి బాబు శ్రీలీల మధ్య జరిగిన డైలాగ్స్, పంచ్‌లు ఆసక్తి రేపుతున్నాయి. రెండవ ఎపిసోడ్ చూడాలనే ఆసక్తిని పెంచుతున్నాయి. ఆగస్టు 22న ఈ ఎపిసోడ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.