సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల వారసులు.. హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు త్వరగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయారు. మరికొందరు మాత్రం స్టార్ డమ్ సంపాదించి ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇలా కేవలం హీరో, హీరోయిన్ల పిల్లలే కాకుండా నిర్మాతలు, డైరెక్టర్లు, స్టార్ కెమెరామెన్ ల పిల్లలకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలానే బుల్లితెర నటీనటుల పిల్లల కూడా హీరోలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా మరో నట వారసురాలు సినీ పరిశ్రమకు పరిచయం కానుంది. ఒకప్పుడు తన అందాలతో యువతను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు త్వరలో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రవీనా టాండన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పలు తెలుగు చిత్రాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రవీనా టాండన్ ఒకరు. 1990ల్లో తన అంద చందాలతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బాలీవుడ్ తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోని అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది. సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చిత్రంలో అద్భుతమైన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇటీవల పలు సినిమాలతో సినీ ప్రియులను అలరించింది అందాల భామ రవీనా టాండన్. అయితే తాజాగా ఆమె నట వారసురాలిని కూడా సినిమాలో తీసుకురానుంది.
రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అయితే రాషా తడానీ అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్ తో జంటగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఇక ఈ యువ జంట నటించనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సమాచారం. ఈ చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారని టాక్. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ మునుపెన్నడు కనిపించనంత వెరైటీగా కనిపించనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి రవీనా టాండన్ కుమార్తెపై పడింది. రాషా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ సాగుతోంది. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.