సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తుంటాయి. అయితే వీటిల్లో కొన్ని నిజాలు ఉంటాయి, మరికొన్ని రూమర్స్ ఉంటాయి. అయితే నిజాల విషయం పక్కనే పెడితే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రూమర్స్ సంబంధిత వ్యక్తులను ఎంతో బాధిస్తుంటాయి. అలానే ఈ రూమర్స్ అనేవి ముఖ్యంగా సినిమా వాళ్ల విషయంలో ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా పలనా హీరోయిన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఆ నటుడు రోడ్లపై అడుక్కుంటున్నాడు అంటూ అనేక రకాల అసత్య వార్తలు ప్రచారం జరుగుతుంటాయి. కొందరు ఆర్టిస్టులు తమపై వచ్చే ఇలాంటి వార్తల గురించి పెద్దగా స్పందించారు. మరికొందరు మాత్రం తమపై జరుగుతున్న అసత్య వార్తల ప్రచారంపై స్పందిస్తుంటారు. తాజాగా సీనియర్ నటి రమాప్రభ కూడా తనపై జరుగుతున్న అసత్యవార్తలపై స్పందించారు. మరి.. ఆ రూమర్స్ ఏంటో, ఆమె స్పందన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రమాప్రభ.. టాలీవుడ్ ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె దాదాపు పద్నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ , హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్ గా నటించి.. అందర్ని అలరించారు. బామ్మగా, అమ్మ, అక్క, వదిన ఇలా అనేక పాత్రలో నటించి..తమ ఇంటి మనిషి అనేంతల గుర్తింపు సంపాదించారు. కొన్నేళ్ల క్రితం చేతినిండ సినిమాలతో బిజీగా గడిపిన.. వయోభారంతో కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆమెపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రమాప్రభ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అడుక్కు తినే పరిస్థితి వచ్చిందంటూ కొందరు వార్తలు రాశారు. అవే సోషల్ మీడియాలోను తెగ వైరల్ అయ్యాయి. తనపై వస్తున్న వార్తలపై తాజాగా రమాప్రభ స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ..” నేను అడుక్కు తిన్నాని యూట్యూబ్ లో తెగ రాస్తున్నారు. నా సొంత యూట్యూబ్ ఛానల్ అయిన ‘రమాప్రభ ప్రయాణం’ లో నా ఇంటిని చూపించాను. నిజంగా నేను అడుక్కు తినే పరిస్థితిలో ఉంటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నా యూట్యూబ్ వీడియోల కోసం నేను బిజీగా పని చేస్తున్నాను. అలాంటిది ఏ గ్యాప్ లో నేను అడుక్కున్నాను? పూరీ, నాగార్జున, మరికొందరు సెలబ్రిటీలు నామీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. నన్ను తమ ఇంటి మనిషిగా వాళ్లు ఫీలైనప్పుడు అది సహాయమో, అడుక్కోవడమో ఎందుకువుతుంది? వాళ్లు నాకు భిక్షం వేయడం లేదు.. ప్రేమతో ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందరి కంటే నేను చాలా ధనవంతురాలిగా ఉన్నాను” అని రమాప్రభ చెప్పుకొచ్చారు. మరి.. రమాప్రభ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.