ఈ మద్య సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత సినీ సెలబ్రెటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా లాంటి సోషల్ మాద్యమాల ద్వారా ఫోటోలు, వీడియోలు, తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. ఈ మద్య తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంటూ వరుస ఆఫర్లతో దూసుకు పోతున్నారు. అలాంటి వారిలో ప్రియాంక జవాల్కర్ఒకరు. అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న ఈ అమ్మడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ వెండితెరపై మెరిసింది. కాకపోతే ఈ అమ్మడు నటించిన చిత్రాలు టాక్సీవాల మినహా ఏదీ మంచి సక్సెస్ కాలేకపోయాయి. ఈ ఏడాది తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటోంది ప్రియాంక. తాజాగా ప్రియాంక తన అభిమానులతో ముచ్చటించింది. అందులో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
ఇది చదవండి: షూటింగ్ లో హీరో విశాల్ కి తీవ్ర గాయాలు!
ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆ ముద్దుగుమ్మను మీ గూగుల్ హిస్టరీ చూపించమని అడిగాడట. తాను రాత్రి తను సెర్చ్ చేసిన వాటిని ఏకంగా స్క్రీన్ షాట్ తీసి మరీ పోస్ట్ చేసింది. అందులో ప్రియాంక నాసా, మల్టీవర్స్, టైం ట్రావెల్, పారలల్, యూనివర్స్ వర్సెస్ మల్టీవర్స్, జీమెయిల్, అనురాగ్ కశ్యప్ ఇలా రకరకాలుగా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి నన్ను ఎవరో అడిగారు.. కానీ ఎందుకు అడిగారు అంటూ ప్రియాంక తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఏది ఏమైనా నెటిజన్లు అడిగే తింగరి ప్రశ్నలకు హీరోయిన్ భలే సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.