90స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరొందిన పాకీజా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేసి, చివరికి తిండిలేక పూట గడవడమే కష్టంగా మారిందనే మాటలు ఆమె నోట వింటుంటే ఖచ్చితంగా ఎవరి కంట్లో అయినా కన్నీళ్లు తిరుగుతాయి.
చిత్రపరిశ్రమలో నటీనటుల జీవితాలు ఎప్పుడెలా వెలుగుతాయో.. ఎప్పుడెలా చీకటిమయం అవుతాయో ఎవరు అంచనా వేయలేరు. ఎందుకంటే.. కొన్నిసార్లు చేతినిండా సినిమాలతో కెరీర్ లో బిజీ పీరియడ్ చూసినవారు కూడా ఒక్కోసారి అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన సందర్భాలు, పరిస్థితులను మనం చూస్తున్నాం. అలా టాలీవుడ్ లో నటులుగా వెలిగిన సీనియర్స్ అంతా ఒక్కొక్కరుగా దీనస్థితిలో బయటపడుతున్నారు. మరి ఎప్పుడో అవకాశాలు రాక సినిమాలు మానేసినవారు ఇన్నాళ్లు ఏమైపోయారు? అనే సందేహం కలగవచ్చు. అందుకు కారణాలు ఏవైనా వారున్న దుస్థితిని ఎవరైనా చలించిపోతారు.
ఇక 90స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరొందిన పాకీజా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేసి, చివరికి తిండిలేక పూట గడవడమే కష్టంగా మారిందనే మాటలు ఆమె నోట వింటుంటే ఖచ్చితంగా ఎవరి కంట్లో అయినా కన్నీళ్లు తిరుగుతాయి. నటి పాకీజా అలియాస్ వాసుకి.. తమిళ, తెలుగు భాషలలో సుమారు 150కి పైగా సినిమాలు చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో చేసిన పాకీజా పాత్ర ద్వారా ఆమె పేరు తెలుగులో పాకీజాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చాలా అందరి స్టార్స్ తో నటించి కేవలం తెలుగులోనే 50 సినిమాలు చేసినట్లు ఆమె చెప్పింది.
లేడీ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, ఆస్తిపాస్తులు ఏమి వెనకేసుకోలేదట. దీంతో రీసెంట్ గా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాకీజా.. తనను ఇండస్ట్రీ నుండి ఎవరైనా ఆర్థికంగా ఆదుకోవాలని లేదా ఇండస్ట్రీలో అవకాశాలు అయినా ఇప్పించగలరని కోరింది. దీంతో పాకీజా దీనస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు ఆమెకు ఆర్థికంగా సహాయం అందించి ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో.. తనకు సహాయం అందించి ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవికి, నాగబాబుకి పాకీజా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి నటి పాకీజా గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.