గంగోత్రి సినిమాతో బాలనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్ రామ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతొంది. కావ్య నటిస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంత చేసుకుంటున్నాయి.
గంగోత్రి సినిమాతో బాలనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్ రామ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతొంది. కావ్య నటిస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంత చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా హిట్టైన లోబడ్జెట్ మూవీ బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్ కూడా లక్కు బాగానే కుదిరింది. ఇందులో సంధ్య పాత్రలో గ్లామర్‌కి స్కోప్ లేని పాత్రలో నటించిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపొతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నా ముద్దు పేరు అమ్ము అని అన్నారు. అలాగే నాగచైతన్య గురించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వేళ్తే..
తను మాట్లాడుతూ.. నా ముద్దు పేరు అమ్ము, నాకు ఇష్టమైన ప్రదేశం బీచ్, నేను నిద్ర లేచకా ఇన్‌స్టాగ్రామ్ వాడుతాను, అలాగే కూచిపుడి డ్యాన్సర్ ని , జిల్లా స్థాయి వాలిబాల్ ప్లేయర్ ని అంటూ.. కామెంట్స్ చేసింది. ఇదే క్రమంలో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అని అడిగితే.. నా సెలబ్రిటీ క్రష్ నాగచైతన్య అని కావ్య కళ్యాణ్ రామ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే నాకు ఇష్టమైన అన్నం, అవకాయ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. పరిస్థితులను, ఎమోషన్స్ ను సులువుగా అర్థం చేసుకోవడం నా ప్లస్ పాయింట్ అని ఆమె అన్నారు. అలాగే నాకు కొంచెం బద్దకం కూడా ఎక్కువని పేర్కొన్నారు. ఇక నాకు ఇష్టమైన దర్శకులలో గౌతమ్ మీనన్, శేఖర్ కమ్ముల, మణిరత్నం అని కావ్య కామెంట్లు చేశారు. మా ఊరు వచ్చేసి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అని తాను పెరిగింది మాత్రం హైదరాబాద్ లో అని ఆమె అభిప్రాయం వ్యక్తి చేశారు.
నేను లా చేశాను కరోనా సమయంలో సినిమాల్లోకి రావాలనే ఆలోచన వచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని కావ్య కళ్యాణ్ రామ్ అన్నారు. తాజాగా ఉస్తాద్ మూవీ రిలీజైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ సింహా, కావ్య కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహా తదితరులు నటించారు. వారాహి బ్యానర్‌లో బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫణిదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. రానున్నరోజుల్లో మరిన్ని సినిమాలు చేయనుంది.