నటి కస్తూరి ఆదిపురుష్ సినిమా పోస్టర్లపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీరాముడి, లక్ష్మణుడికి మీసాలు, గడ్డలతో ఎందుకు చూపించారని ఆమె ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
రామాయణం ఆధారంగా తీసుకుని దర్శకుడు ఓం రావత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆది పురుష్. ఇక రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా, సీత సాత్రలో కృతి సనన్ నటించారు. ఇక వీరితో పాటు రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందితో పాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో తెరకెక్కించారు. చిత్ర యూనిట్ ఈ మూవీని ఈ నెల 16న విడుదల చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపుతిలో గ్రాండ్ గా జరింది.
ఇదిలా ఉంటే, ఈ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్ విడుదలైన నాటి నుంచి ఏదో ఒక అంశంతో వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న దర్శకుడు ఓం రావత్, హీరోయిన్ కృతిసనన్ కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లారు. అక్కడే ఓంరావత్, హీరోయిన్ కృతిసనన్ హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై చాలా మంది స్పందిస్తూ దేవుడి స్థలంలో ఇవేం పాడు పనులు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ఇది మరువకముందే మరో వివాదం వచ్చి పడింది.
తాజాగా నటి కస్తూరి ఆదిపురుష్ పోస్టర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ చూస్తే నాకు అచ్చం కర్ణుడు గుర్తుకు వస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. అసలు శ్రీరాముడికి, లక్ష్మణుడికి మీసాలు ఉండడం ఏంటని ఆమె ప్రశ్నించారు. టాలీవుడ్ లో ఇప్పటికీ ఎంతో మంది నటులు రాముడు పాత్రలో అద్భుతంగా కనిపించారు. కానీ, ప్రభాస్ మాత్రం రాముడిలా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నారని అన్నారు. రాముడు, లక్ష్మణుడికి గడ్డలతో చూపించిన సాంప్రదాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి మార్పులు ఎందుకు చేశారో అస్సలు అర్థం కావడం లేదంటూ నటి కస్తూరి విమర్శలు గుప్పించారు. అయితే, ఆమె తాజా వ్యాఖ్యలను కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి నటి కస్తూరి తాజా కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రపై నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.