Actress: ప్రముఖ బెంగాలీ నటి డొలన్ రాయ్ అస్వస్థతకు గురయ్యారు. అవుట్ డోర్ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలయ్యారు. గురువారం డొలన్ రాయ్ ఓ సీరియల్‌కు సంబంధించి అవుట్ డోర్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తీవ్రమైన ఎండలో షూటింగ్ చేశారు. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వడ దెబ్బ తగిలిందని సమాచారం. దీంతో ఆమెను దక్షిణ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డొలన్ రాయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
కాగా, డొలన్ రాయ్ 1991లో వచ్చిన ‘సజనీ గో సజనీ’ సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిది సినిమాల్లో నటించారు. 1996లో వచ్చిన ‘సంఘట్’ సినిమాకు గానూ నేషనల్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2009లో ‘మా తోమే చారా ఘమ్ అసెనా’ సినిమాతో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సీరియళ్లతోనే బిజీగా గడుపుతున్నారు. మరి, డొలన్ రాయ్‌కి అస్వస్థతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Aadhi Pinisetty: నిక్కీ గల్రాని నుండి హీరో ఆది పినిశెట్టి కట్నంగా ఎంత తీసుకున్నాడంటే..?