దివ్య స్పందన సూర్యతో కలిసి నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళం, తెలుగు భాషల్లో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది.
హీరోయిన్ దివ్య స్పందన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో తీసింది కేవలం ఒక సినిమానే అయినప్పటికి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో సినిమా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమె అతి తక్కువ కాలంలో కన్నడ నాట టాప్ హీరోయిన్‌గా మారారు. శాండల్‌వుడ్‌లోని అందరు టాప్ హీరోలతో సినిమాలు చేశారు. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే అనుకోని విధంగా ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.
రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలను మాత్రం ఆమె వదులుకోలేదు. తనకు నచ్చిన మంచి కథలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్‌ల కంటే ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇక, దివ్య స్పందనకు మూగ జీవాలంటే చాలా ఇష్టం. ఆమె ‘చాంప్’ అనే ఓ శునకాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అయితే, అనుకోని విధంగా ఆ శునకం ఇంటినుంచి పారిపోయింది. ఆమె తన ట్విటర్ ఖాతాలో ‘చాంప్’ గురించి ఓపోస్ట్ పెట్టారు. దాన్ని వెతికి పెట్టిన వారికి ఓ మంచి బహుమతి ఇస్తానని అన్నారు. ఆ పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే ఓ విషాద వార్త తెరపైకి వచ్చింది.
దివ్య స్పందన చాంప్ గురించిన ఓ పోస్ట్ పెట్టారు. ‘చాంప్ ఇక లేడు. దాన్ని వెతకటంలో సహాయం చేసిన వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆ పోస్టు చూస్తున్న నెటిజన్లు ఆమెకు తమ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, దివ్య స్పందన 2003లో నందమూరి కల్యాణ్ రామ్‌తో కలిసి ‘అభిమన్యు’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఆమె ప్రస్తుతం ‘‘ఉత్తరాఖండా’’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.