ప్రముఖ బహుభాషా నటుడు రవి కిషన్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే సంవత్సరంలో ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. 2022, మార్చి నెలలో రవి కిషన్ పెద్ద అన్నయ్య రమేష్ కిషన్ శుక్లా క్యాన్సర్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ ఘటన జరిగి సంవత్సరం కూడా అవ్వలేదు. ఇంతలోనే ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. రవి కిషన్ మరో పెద్ద అన్నయ్య రామ్ కిషన్ నిన్న మధ్యాహ్నం చనిపోయారు. ఆదివారం ఉదయం ఆయన సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురికావటంతో ముంబైలోని నానావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రామ్ కిషన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు.
అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవి కిషన్ స్వయంగా తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ‘‘ చాలా బాధాకరం.. మా పెద్ద అన్నయ్య రామ్ కిషన్ ఆదివారం కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడు. ఆయన్ని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్పించాము. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. మహా దేవుడు ఆయన ఆత్మకు తన కాళ్ల దగ్గర చోటివ్వాలని కోరుకుంటున్నా.. ఓం శాంతి, శాంతి, శాంతి’’ అని పేర్కొన్నారు. ఈ ఉదయం రామ్ కిషన్ అంత్యక్రియలు ముగిశాయి.
అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ రామ్ కిషన్ అన్నయ్య నిజంగా మా ఇంటికి రాముడి లాంటి వాడు. ఆయన నిర్మలమైన నగు ముఖాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన ఆకస్మిక మరణం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీరందరూ ప్రార్థనలు చేయండి. ఓం శాంతి’’ అని రాసుకొచ్చారు. మరి, బహుభాషా నటుడు రవి కిషన్ ఇంట్లో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
रामकिशन भैया सच में हमारे घर के राम थे शांत मुस्कुराता चेहरा छल कपट नहीं उनका अचानक चले जाना स्तब्ध कर दिया हम सबको ,आज में अकेला पढ़ गया उनकी पुण्य आत्मा के शान्ति के लिए आप सब कृपया प्रार्थनां करना 🙏 ओम् शान्ति शान्ति । pic.twitter.com/efnLeqfBjP
— Ravi Kishan (@ravikishann) February 5, 2023