మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ స్వయం కృషితో పైకి వచ్చిన మెగాస్టార్ జీవితం.. ఎంతో మందికి ఆదర్శం. ఆయన కోట్ల మంది అభిమానులను గుండెల్లో జీవితఖైదీగా ఉన్నారు. సినిమాలే కాకుండా సామాజి సేవ సేవకార్యక్రమాల్లోనూ చిరంజీవి ముందుంటారు. మెగాస్టార్ అన్నా, ఆయన ఫ్యామిలీ అన్న పడిచచ్చే అభిమానులకు లెక్కే లేదు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ తో చిత్ర దర్శకుడు కె.బాబీ, మెగా బ్రదర్ నాగబాబు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో నాగాబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని కానీ, ఆయన ఫ్యామిలీని కానీ ఎవరైనా, ఏమైనా అంటే అభిమానులు ఎంతదూరమైన వెళ్తారంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ‘గాడ్ ఫాదర్’ సినిమాతో మెగస్టార్ ప్రేక్షకులను అలరించారు. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు కె.బాబీ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉంది. ఇదే సమయంలో ఇటీవల హైదరాబాద్ లో మెగా ఫ్యాన్స్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి వాల్తేరు వీరయ్య మూవీ దర్శకుడు కె.బాబి, మెగా బ్రదర్ నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలను మెగా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, వారిని సేవ కార్యక్రమాల్లో భాగం చేసి ముందుకు నడిపించిన తొలి సౌత్ హీరో ఆయనేనని నాగబాబు అన్నారు.
ఇంకా నాగబాబు మాట్లాడుతూ..”అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మెగాఫ్యాన్స్ అందరు చూలా పవర్ ఫుల్ ఆర్గనైజేషన్. కేవలం ఇక్కడే కాదు.. ఇండియాలోనే ఇంత పవర్ ఫుల్ ఆర్గనైజేషన్ మరొక నటుడికి లేదు. ఆయన అంటే పడి చచ్చే వారు ఎందరో ఉన్నారు. చిరంజీవి గారు ఎలాంటి వివాదల జోలికి వెళ్లరు. వినయ విధేయులుగా ఉంటారు. అయితే చిరంజీవి మీద కానీ.. ఆయన కుటుంబ మీద కానీ ఈగ వాలినా ఎంతకైనా వెళ్లగలిగే వారు.. మెగా అభిమానులు. చిరంజీవి విధేయతను ఎవరైనా అవకాశంగా తీసుకుంటే మొదట రియాక్ట్ అయ్యేది అభిమానులే. ఆయన అభిమానిగా నేనైతే ఊరుకోను. ఇంకా అభిమానులు రెచ్చగొట్టే పనులు నేను చేయను. ఒక్క మాట అటు ఇటు నేను మాట్లాడితే శాంతి భద్రతలకు విఘాతం కలిగ వచ్చని మౌనంగా ఉంటున్నాను” అని నాగబాబు అన్నారు. మరి.. నాగబాబు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.