సినీ ఇండస్ట్రీలో మన్సూర్ అలీ ఖాన్ అంటే ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళియాల భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విజయ్ కాంత్ నటించిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ చిత్రంలో విలన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగు లో ఈ మూవీ మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం మన్సూర్ అలీఖాన్ దర్శకత్వంలో ఆయన కొడుకు అలీఖాన్ తుగ్ల్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘కడమాన్ పారై’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీలో ఆయన కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26 న రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఈ మూవీకి థియేటర్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మన్సూర్ అలీ ఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవల ధనుష్ హీరోగా నటించిన ‘తిరుచిట్రంఫలం’ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పటికీ చాలా థియేటర్లలో ప్రదర్శిస్తునే ఉన్నారు. నిన్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ రిలీజ్ అయ్యింది.. మరోవైపు అరుళ్ నిధి నటించిన డైరీ మూవీ కూడా రిలీజ్ కావడంతో మన్సూర్ అలీ ఖాన్ చిత్రానికి థియేటర్ల ఇబ్బంది ఎదురైంది.
ఈ విషయంపై స్పందించిన మన్సూర్ అలీ ఖాన్.. నా కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన ‘కడమాన్ పారై’ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదు… ఇప్పటికే ప్రమోషన్ కోసం పది లక్షలు ఖర్చు చేశాం.. తాము అనుకున్న విధంగా థియేటర్లలో మూవీ రిలీజ్ కాకపోవడంతో విసుగు పుట్టింది.. ఈ విషయంలో తాను పూర్తిగా విరక్తి చేందానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మూవీ రిలీజ్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చానని.. చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మన్సూర్ అలీఖాన్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.