తెలుగు సినీ ప్రేక్షకులకు సినిమాలు అన్నా.. సినీ తారలు అన్నా ఎనలేని ప్రేమాభినాలు ఉంటాయి. ఇక తమ అభిమాన హీరో కళ్లముందే ఉంటే.. ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా.. ఇంతా కాదు. ఇక హీరోలు సినిమా రిలీజ్ కు ముందు పబ్లిసిటీ టూర్లు వేయడం సహజమే. అందులో భాగంగానే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. సంక్రాంతి సంబరాలను కుటుంబ సభ్యులతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరుపుకున్నాడు. దాంతో పాటుగా గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను కిరణ్ దర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అతడిపై పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కిరణ్ అబ్బవరం.. రాజావారు రాణివారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సినిమాల ద్వారా యూత్ లో మంచి క్రేజ్ సంపాందించుకున్నాడు. తరువాత వరుసబెట్టి కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి నిరాశపరిచాయి. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమాతో ఫిబ్రవరి 17న మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా మురళీ కిషోర్ అబ్బురు డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ అబ్బవరం సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నాడు.
Next Level Reception For @Kiran_Abbavaram #KiranAbbavaram mass craze in east Godavari . pic.twitter.com/9o10XHwCDT
— BA Raju’s Team (@baraju_SuperHit) January 16, 2023
ఈ జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇదిలా ఉంటే తాజాగా తూర్పు గోదావరిలోని ఓ ఊర్లో పర్యటించిన కిరణ్ కు ఊహించని ఘన స్వాగతం లభించింది. కారుపై నుంచి అభిమానులకు అందరికి అభివాదం చేస్తున్న కిరణ్ అబ్బవరంపై అభిమానులు పూల వర్షం కురిపించారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. చేతులు పట్టుకుని లాగారు కూడా.. అయిన నవ్వుతూనే అందరికి అభివాదం చేశాడు కిరణ్. ఓ యంగ్ హీరోకి, ఓ స్టార్ హీరో రేంజ్ లో మాస్ వెల్ కమ్ లభించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి కిరణ్ అబ్బవరం మాస్ ఫాలోయింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Happy Bhogi 🥳🥰#KiranAbbavaram #Bhogi2023 #VinaroBhagyamuVishnuKatha pic.twitter.com/ss3eHLCigD
— Actor_KiranAbbavaram (@Actor_KA_) January 14, 2023