సినీ ఇండస్ట్రీలో బ్యాచిలర్ సెలబ్రిటీలతో పాటు సీనియర్ సెలబ్రిటీల వారసులు, వారసురాళ్లు సైతం ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల పలువురు హీరోహీరోయిన్లతో పాటు సీరియల్ యాక్టర్స్ సైతం పెళ్లి చేసుకొని ఓ ఇంటివారయ్యారు. కాగా.. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడి కుమారుడు పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు బాబురాజ్. మలయాళం ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా క్రేజ్ ఉన్న బాబురాజ్ కుమారుడు అభయ్.. ఫ్యాషన్ మోడల్, డిజైనర్ గ్లాడిర్ మరియమ్ ని ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక అభయ్ – మరియమ్ ల ఎంగేజ్ మెంట్ 2022 డిసెంబర్ 31న జరిగింది. కాగా.. ఇప్పుడు కొత్త సంవత్సరం ఆరంభంలో జనవరి 5న అంగరంగ వైభవంగా క్రిస్టియన్ పద్ధతిలో వివాహమాడారు. ప్రస్తుతం ఈ నూతన దంపతులకు నెటిజన్స్.. బాబురాజ్ ఫ్యాన్స్ మ్యారేజ్ విషెష్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాబురాజ్ మొదటి భార్యకు జన్మించాడు అభయ్. మొదటి భార్యతో బాబురాజ్ కి ఇద్దరు కొడుకులు అభయ్, అక్షయ్. ఆ తర్వాత బాబురాజ్ సీనియర్ స్టార్ హీరోయిన్ వాణి విశ్వనాధ్ ని 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఆర్చ, కొడుకు ఆద్రి.
ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. బాబురాజ్ మలయాళంతో పాటు తమిళ, కన్నడ, తెలుగు, హిందీ సినిమాలలో కూడా నటించాడు. అలాగే మలయాళం ఇండస్ట్రీలో పలు సినిమాలను డైరెక్ట్ చేసి.. ప్రొడ్యూస్ కూడా చేశాడు. బాబురాజ్ తెలుగులో అంతిమ తీర్పు అనే సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఇక బాబురాజ్ భార్య, హీరోయిన్ వాణి విశ్వనాథ్ కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఘరానా మొగుడు, ధర్మతేజ లాంటి సూపర్ హిట్స్ తో పాటు 40కి పైగా సినిమాలు చేసింది. దాదాపు తెలుగు స్టార్స్ అందరి సరసన నటించి వాణి గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.