మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవలే ఆచార్య ట్రైలర్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆచార్య ట్రైలర్ ఏప్రిల్ 12న సాయంత్రం 5:49 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే.. మెగాస్టార్ కి ఇది 152వ చిత్రం కావడం విశేషం. ఈ క్రమంలో ఆచార్య ట్రైలర్ ను 152 స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఏయే స్క్రీన్ లలో రిలీజ్ చేయనున్నారో ఆ స్క్రీన్స్ లిస్ట్ ప్రకటించింది చిత్రబృందం. ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి ఆచార్య సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
The 152nd film of Megastar @KChiruTweets calls for Mega Massive celebrations at 152 screens🤘#AcharyaTrailer will be celebrated in the below screens on 12th April at 5:49 PM 🔥@AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja @SonuSood #ManiSharma @MatineeEnt pic.twitter.com/fdTUz3aWSJ
— Konidela Pro Company (@KonidelaPro) April 11, 2022