Tina Sadhu: ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా సాధు(38) మృతికి సరైన కారణాలు ఏవనే దానిపై క్లారిటీ రావటం లేదు. టీనా మరణించి రెండు రోజులు అవుతున్నా ఆమెది ఆత్మహత్యా? లేక సహజ మరణామా? లేక గుండెపోటా? లేక ఇంకేదైనాన?.. అన్న దానిపై స్పష్టత రావటం లేదు. ఈ నేపథ్యంలో ఆట షోలో టీనాకు జోడీగా చేసిన సందీప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సుమన్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘ ఆమె చాలా ఫిట్‌గా ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ లేదు. నాకు తెలిసి కొంచెం డ్రింక్ చేస్తుంది. దాని వల్ల అంటున్నారు. అది కూడా యూట్యూబ్‌లో చూశాను. జస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చి బాగా ఉన్న అమ్మాయి.. సడెన్‌గా.. ఇంత ఫాస్ట్‌గా హార్ట్ ఎటాక్ రావటం ఏంటి? అన్నది నా క్వశ్చన్..’’ అని అన్నారు.
కాగా, ఓంకార్ నిర్వహించిన ఆట డ్యాన్స్ షోతో టీనా చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సీజన్ 4కి జడ్జిగా కూడా వ్యవహించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోంది. అయితే టీనా ఇంత ఆకస్మాత్తుగా మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీనాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన టీనా, యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసిందని, తిరిగి డ్యాన్స్ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని మనసులోని మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించిందని, అయితే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు తెలుపుతున్నట్లుగా ఓ వార్త వైరల్‌గా మారింది. మరి, సందీప్ అనుమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Tina Sandhu: ‘ఆట’ టైటిల్ విన్నర్ టీనా మృతిపై అనుమానాలు.. మద్యం ఎక్కువవ్వడం వల్లే చనిపోయిందా?!