ఆది పినిశెట్టి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఆది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2006లో తేజ దర్శకత్వంలో వచ్చి.. “ఒక ‘వి’ చిత్రం” సినిమాతో ఆది పినిశెట్టి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత మిరుగమ్ అనే తమిళ సినిమాలో నటించి మెప్పించారు. వైశాలి, ఏకవీర, గుండెల్లో గోదావరి, మలుపు వంటి సినిమాలో అద్భుతంగా నటించి అందర్ని మెప్పించాడు. అలానే సరైనోడు సినిమాలో విలన్ గా నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలానే నిన్ను కోరి, మరకతమణి, రంగస్థలం,అజ్ఞాతవాసి,యూటర్న్ నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఇటీవలే రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ సినిమాలో గురు అనే విలన్ పాత్రలో ఓ రేంజ్ లో యాక్ట్ చేశాడు. ఇలా ఆది పినిశెట్టి హీరోగా, విలన్ గా, విలక్షణ నటుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నాడు.
ఇక అతడి వ్యక్తి గత జీవిత విషయానికి వస్తే.. గతేడాది మేలో కోలీవుడ్ హీరోయిన్, నిక్కీ గల్రానీని ఆది పినిశెట్టి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అలానే త్వరలోనే ఆది-నిక్కీ ల జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ వార్తల ప్రచారం కూడా జరుగుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఆది పినిశెట్టి దంపతులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కోలీవుడ్ లో మాత్రం నిక్కీ గర్భవతి అయ్యిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు అలా ఉంచితే.. ఇటీవల నిక్కీగల్రాని బర్త్ డే వేడుక జరిగింది. తన భార్య పుట్టిన రోజుని ఆది పినిశెట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. బంధువులు, స్నేహితుల మధ్య నిక్కీ గల్రాని కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ దంపతులిద్దరు ఒకరికొకరు కేట్ తినిపించుకుంటూ సందడి చేశారు.
అంతేకాక ఆది తన భార్య ముఖానికి కేక్ రాస్తూ… తెగ అల్లరి చేశాడు. ఈ వేడుకకు నిక్కీ గల్రాని సోదరి సంజనా గల్రాని తో పాటు మరికొందరు హాజరయ్యారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి భార్య నిక్కీ గల్రాని పుట్టిన రోజు వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆది సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అటు హీరోగా.. ఇటు విలన్ గా రాణిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాలు చేస్తూ ఆది బిజీగా ఉన్నాడు. ఘాటైన హీరోలకు ధీటైన విలన్ గా ఆది పినిశెట్టి ఇండస్ట్రీలో కనిపిస్తున్నాడు. దాంతో ఫ్యాషనేట్ విలన్ లకు ఆది పినిశెట్టి మంచి ఛాయిస్ గా మారాడు. దీంతో డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఆదిపైనే పడింది.మరీ.. వైరల్ అవుతున్న ఆది భార్య నిక్కీ గల్రానీ బర్త్ డే సెలబ్రేషన్ వీడియోలపై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.