చిత్ర పరిశ్రమలో రోజూ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాయి. అలా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు సాధారణంగానే విదేశీ సినీ ఫెస్టివల్స్ లో ప్రదర్శితం అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 53వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఉత్సవాలు గోవాలో జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్ లో ముగింపు రోజైన సోమవారంప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 చిత్రాలను ప్రదర్శించారు. అయింతే అందులో 14 చిత్రాలు బాగున్నాయని, ఒకే ఒక్క సినిమా మాత్రం అసలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎందుకు ప్రదర్శించారో అర్ధం కావడం లేదని సాక్షాత్తు IFFI జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ అన్నారు.
గోవా వేదికగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. సోమవారం ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన 15 చిత్రాలను ప్రదర్శించారు. అయితే ఈ సినిమాల్లో 14 సినిమాలు బాగున్నాయని కానీ ఒక్క చిత్రాన్ని మాత్రాం ఏ ప్రాతిపదికన ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించారని ఫెస్టివల్ జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ కేంద్ర మంత్రుల ముందే నిర్వాహకులను విమర్శించాడు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ..” ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి మేమంతా షాక్ కు గురయ్యాం. అదీకాక ఎంతో నిరాశ చెందాం కూడా. ఎందుకుంటే పనికిరాని ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా ఇది. ఇంటర్నేషనల్ కాంపీటిషన్ విభాగంలో భాగంగా 15 మూవీలను ప్రదర్శించారు. అందులో 14 మంచి చిత్రాలు. కానీ చివరిది కశ్మీర్ ఫైల్స్ మాత్రం చౌకబారు సినిమా” అని కేంద్ర మంత్రుల ముందే విమర్శించారు లపిడ్.
కళాత్మకమైన చిత్రాలకు వేదిక కావాల్సిన ఇలాంటి ఫెస్టివల్స్ లో ఇలాంటి సినిమాలు ప్రదర్శించడం అస్సలు మంచిది కాదని లపిడ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు జ్యూరీ హెడ్ గా ఉన్న లపిడ్ ఇజ్రాయెల్ కు చెందిన ఫిల్మ్ డైరెక్టర్. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను పొందాడు అతడు. అదీకాక కేన్స్ వంటి పలు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో జ్యూరీ సభ్యునిగా చేశాడు లపిడ్. ఇక ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయానికి వస్తే.. 1990ల్లో కశ్మీర్ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, వారి వలసల గురించి తెరకెక్కిన చిత్రం. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించాడు. దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఈ చిత్రం ఒకటిగా నిలిచింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, మరికొంత మంది మంత్రుల ముందే లపిడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.