2021 ఏడాదంతా తెలుగు ఇండస్ట్రీ విజయ పరంపర కొనసాగించింది. ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీగా టాలీవుడ్.. అటు రిలీజ్ చేసిన సినిమాల సంఖ్య పరంగా, ఇటు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా రికార్డు సృష్టించింది. గతేడాది ఓవైపు మహమ్మారి కరోనా భయం ఉన్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ ఇండస్ట్రీని వెనక్కి నెట్టింది టాలీవుడ్.
ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలు కలిసి 470 కంటే తక్కువ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశాయి. ఆ ఏడాది రిలీజైన అన్ని సినిమాలు రూ.3,200 కోట్లు (గ్రాస్) రాబట్టినట్లు సమాచారం. కేవలం టాలీవుడ్ గురించి మాత్రమే చెప్పాలంటే, 2021లో పుష్పతో పాటు దాదాపు 180 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అన్నింటిలో పుష్ప(150కోట్లు), వకీల్ సాబ్(129కోట్లు) కలెక్షన్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా 2021 బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా ఇండస్ట్రీ రూ.1300 కోట్లు (గ్రాస్) బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఏడాదంతా నెమ్మదిగా సాగించిన బాలీవుడ్ ఇండస్ట్రీలో.. సూర్యవంశీ సినిమా చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది. 2021లో దాదాపు 55 సినిమాలు డబ్బింగ్ వెర్షన్‌లో విడుదలయ్యాయి. ఈ డబ్బింగ్ సినిమాలే రూ.760 కోట్లు వసూలు చేయడం విశేషం. మొత్తానికి 2021 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు, తమిళ సినిమాల డబ్బింగ్(హిందీ) వెర్షన్‌లు కూడా సూపర్ కలెక్షన్స్ సాధించి హెల్ప్ అవ్వడం గొప్ప విషయం. మరి 2021 బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల సందడి గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.