ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన బంగ్లాలు కలిగిన హీరోల్లో షారుఖ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయనకు దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు యువకులు కలకలం సృష్టించారు. గోడ దూకి మరీ..
బాలీవుడ్‌లో అత్యంత విలాసవంతమైన ఇళ్లు కలిగిన అత్యంత కొద్ది మంది స్టార్ హీరోల్లో బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒకరు. ఈయనకు ముంబైలో మన్నత్ అనే విలాసవంతమైన భవనం ఉంది. దీని ఖరీదు 1000 కోట్ల రూపాయలకు పైమాటే అని తెలుస్తోంది. గతంలో దీన్ని సినిమా షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలకు అద్దెకు ఇస్తూ ఉండేవారు. అయితే, గత కొన్నేళ్ల నుంచి షారుఖ్ తన కుటుంబంతో ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు సమాచారం. పండుగలకు ఆయన పుట్టిన రోజు నాడు షారుఖ్ మన్నత్ కాంపౌండ్ దగ్గర నిలబడి తనను చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఉంటారు. ఇక, షారుఖ్‌ను చూడాలన్న ఆశతో ఎంతో మంది మన్నత్ ముందుకు వస్తూ ఉంటారు.
అయితే, సెక్యూరిటీ గార్డులు ఆపటంతో నిరాశతో వెనక్కు వెళ్లిపోతుంటారు. షారుఖ్‌ను చూడాల్సిందే అనుకున్న వారు మాత్రం కాంపౌండ్ వాల్ దూకి లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. గురువారం కూడా ఓ ఇద్దరు వ్యక్తులు గుజరాత్‌నుంచి షారుఖ్ ఖాన్‌ను చూడటానికి వచ్చారు. సెక్యూరిటీ గార్డులు ఆపటంతో.. కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి దూరారు. అయితే, వీరిని సెక్యూరిటీ గార్డులు గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 20, 22 ఏళ్ల వయసున్న వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా, షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీపికా పదుకునే ఈ సినిమాలో షారుఖ్‌కు జంటగా నటించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఇక, షారుఖ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇటు, షారుఖ్ అభిమానులతో పాటు అట్లీ అభిమానులు కూడా సినిమా కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి, షారుఖ్ ఖాన్‌ను చూసేందుకు ఆయన అభిమానులు మన్నత్‌లోకి చొరబడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.